Begin typing your search above and press return to search.
2018 రివ్యూ: ఇక్కడ దేవరకొండ.. అక్కడ యశ్
By: Tupaki Desk | 25 Dec 2018 9:20 AM GMT2018 సౌత్ లో ఓ ఇద్దరు హీరోలకు గొప్పగా కలిసొచ్చింది. ఒకరు టాలీవుడ్ యువహీరో విజయ్ దేవరకొండ, ఇంకొకరు కన్నడ హీరో యశ్. ఈ ఇద్దరికీ 100 కోట్ల క్లబ్ ఆయాచిత వరంగా మారనుంది. 2019 కెరీర్ కి ఇది పెద్ద బూస్ట్ అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `గీతగోవిందం` ఈ ఏడాది రిలీజై అతడిని 100కోట్ల క్లబ్ హీరోని చేసింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, తెలుగు రాష్ట్రాల్లో మెగా హీరోలకు ధీటైన అభిమానం అందుకున్న నైజాం హీరోగా పాపులరయ్యాడు. ఇంకా చెప్పాలంటే అభిమానులు అతడిని నైజాం మెగాస్టార్ అని పిలిచేందుకు వెనకాడడం లేదు. ఇదే ఏడాది చివరిలో టాక్సీవాలా చిత్రంతోనూ దేవరకొండ మరో బ్లాక్ బస్టర్ అందుకుని తన హవా చాటాడు. దీంతో 2019లో దేవరకొండ కెరీర్ ధేధీప్యమానంగా వెలగనుందని విశ్లేషిస్తున్నారు.
అలాగే కన్నడ హీరో యశ్ నటించిన కె జి ఎఫ్ భారీ అంచనాల నడుమ రిలీజై పెద్ద విజయం అందుకుంది. ఈ సినిమా కన్నడం సహా తెలుగు - తమిళం - హిందీలో అత్యంత భారీగా రిలీజైంది. కన్నడంలో బంపర్ హిట్. మిగతా చోట్ల ఫర్వాలేదన్న టాక్ అందుకుంది. ఆ క్రమంలోనే 100కోట్ల వసూళ్ల దిశగా సాగుతుండడంతో యశ్ పంట పండిందన్న చర్చా సాగుతోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఓ డ్రైవర్ పుత్రరత్నం బంతాట ఆడుతున్నాడన్న మాటా వినిపిస్తోంది. కె.జి.ఎఫ్ యశ్ కి ఊహించని వరం అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. కన్నడలో ప్రస్తుతం ఏ సూపర్‌స్టార్‌కి లేని గిరాకీ యశ్ దక్కించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. గీత గోవిందం 100కోట్ల క్లబ్.. కెజిఎఫ్ 100కోట్ల క్లబ్ ఈ ఏడాదిలో ఒక మేలుకొలుపు.. అసలు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల్ని అందలం ఎక్కించాయన్న మాట ప్రముఖంగా వినిపిస్తోంది.