Begin typing your search above and press return to search.
హీరో కేసు గెలిచాక ఆమె ఆశలు అడియాశలు
By: Tupaki Desk | 16 Nov 2022 3:07 AM GMTజానీ డెప్ లేకుండా 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ 6' ప్రకటించినప్పుడు దీనిపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో చాలా చర్చ సాగింది. కెప్టెన్ జాక్ స్పారో పాత్రతో భారీ ఖ్యాతిని పొందిన డెప్ ఈ ఫ్రాంచైజీలో అంతర్భాగం. కానీ కొత్తగా ప్రకటించిన ఆరో భాగం 'స్పిన్-ఆఫ్'లో ప్రధాన పాత్ర పోషించడానికి మార్గోట్ రాబీ(ఆస్ట్రేలియన్ నటి)ని ఎంపిక చేసుకున్నారు. డెప్ అప్పటికి కోర్టు గొడవల్లో ఉండడంతో డిస్నీ ఆ నిర్ణయం తీసుకుంది. కానీ ఇంతలోనే కోర్టు తీర్పు వెలువడి పరిస్థితులు మారాయి. తాజా సమాచారం మేరకు డిస్నీ ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు సన్నాహకాల్లో లేదు.
జానీ డెప్ కోర్టు కేసు వల్ల 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' ఫ్రాంచైజీకి తిరిగి రావాలని డిస్నీ అతడిని ఎన్నడూ సంప్రదించలేదని అప్పట్లో కథనాలొచ్చాయి. అంబర్ హియర్డ్ ఆరోపణలు .. సెట్స్ లో అతని వృత్తిపరమైన ప్రవర్తన సహా రకరకాల కారణాలపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. అంతేకాదు.. ఒక మహిళా ప్రధాన పాత్రతో కొత్త స్పిన్-ఆఫ్ మూవీని ప్రకటించారు. పాపులర్ హాలీవుడ్ నటి మార్గోట్ ఈ పాత్రకు ఎంపికైంది. తనతో డిస్నీ షూటింగ్ ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంది.
అయితే 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ స్పిన్-ఆఫ్' లో జానీ డెప్ నటించడం లేదని తెలుసుకున్న అభిమానులు ఎంతగానో కలత చెందారు. మార్గోట్ రాబీ ఆ పాత్రను పోషించడంపైనా చర్చ సాగింది. కానీ ఇంతలోనే సన్నివేశం మారింది. డెప్ తన భార్యపై కేసులో గెలిచాడు. దీంతో డిస్నీ ప్రాజెక్ట్ పై ఆసక్తిని కోల్పోవడంతో సినిమాని ఆపేశారని తాజాగా ప్రధాన మహిళా పాత్రధారి మార్గోట్ ధృవీకరించింది.
మార్గోట్ రాబీ వానిటీ ఫెయిర్ తో మాట్లాడుతూ-"మాకు ఒక ఆలోచన వచ్చింది. మేం చాలా కాలం క్రితం స్త్రీ-నేతృత్వంలో సాగే కథతో సినిమా సాగేలా అభివృద్ధి చేస్తున్నాం. పూర్తిగా పైరేట్స్ కి స్త్రీ-నేతృత్వం వహించదు. కానీ ఇది వేరే రకమైన కథ. నిజానికి చాలా బాగా వచ్చింది. కానీ వారు దీన్ని చేయడం లేదని నేను అనుకుంటున్నాను" అని తన నిరాశను వ్యక్తం చేసింది.
మాజీ భార్య అంబర్ హెర్డ్ పై జరిగిన పరువు నష్టం విచారణలో గెలిచిన తర్వాత జానీ డెప్ కి డిస్నీ క్షమాపణలు చెప్పిందని కూడా వార్తలు వచ్చాయి. 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్' ఫ్రాంచైజీకి తిరిగి రావడానికి డిస్నీ సంస్థ అతనికి 300 మిలియన్ డాలర్ల మొత్తాన్ని కూడా అందించారు. జానీ డెప్ కెప్టెన్ జాక్ స్పారోగా తిరిగి వచ్చే అవకాశం ఉందని మార్గోట్ రాబీ తాజా ప్రకటనతో స్పష్ఠత వచ్చింది. దీంతో జాక్ స్పారో అభిమానులు తమ ఫేవరెట్ రాక కోసం మరోసారి ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ కి క్రేజ్ ఎప్పటిలానే ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.