Begin typing your search above and press return to search.
పదేళ్ల తర్వాత హీరోగా ఓ ప్రయత్నం
By: Tupaki Desk | 8 Jun 2022 4:39 AM GMT1999 లో స్వయంవరం సినిమా తో ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాడు తొట్టెంపూడి వేణు. లయ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా మొదటి సినిమా తోనే సక్సెస్ ను అందుకున్న వేణు ఆ తర్వాత వరుసగా సినిమాలతో దూసుకు వచ్చాడు. అందులో కొన్ని సక్సెస్ అవ్వగా కొన్ని నిరాశ పర్చాయి.. కొన్ని సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మొత్తానికి ఒక పది సంవత్సరాల పాటు వేణు బిజీగా సినిమాలు చేశాడు.
2010 తర్వాత వరుసగా ప్లాప్ లు పడుతుండటంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసేందుకు సిద్ధం అయ్యాడు. అయినా కూడా పెద్దగా ఆఫర్లు రాలేదు. చిన్నా చితకా ఆఫర్లు వస్తుండటంతో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి వ్యాపారం పై దృష్టి పెట్టాడు. 2013 లో రామాచారి సినిమా తర్వాత వేణు ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యాడు. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు వేణు పేరు ఇండస్ట్రీలో చర్చగా మారింది.
ఇప్పటికే రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా లో కీలక పాత్రలో నటించాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇదే సమయంలో హీరోగా కూడా ఒక సినిమాను చేసేందుకు వేణు సిద్దం అయ్యాడట. చాయ్ బిస్కట్ ఫిల్మ్స్ బ్యానర్ లో సూర్య అనే నూతన దర్శకుడి దర్శకత్వం లో వేణు హీరోగా ఒక సినిమా రూపొందబోతోంది. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
ఇండస్ట్రీకి వేణు దూరం అయ్యి పదేళ్లు అయ్యింది. ప్రేక్షకుల జనరేషన్ మారిపోయింది. ఇప్పటి యువతరం ప్రేక్షకుల్లో చాలా మందికి వేణు అంటే కనీసం తెలియదు. అయినా కూడా వేణు హీరోగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కొత్త హీరో మాదిరిగానే ఇప్పుడు వేణు రీ ఎంట్రీ ఉండబోతుంది. రీ ఎంట్రీ ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే జనాలు ఏమైనా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది.
వేణు వరసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరియు అప్పుడప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలను చూసిన వారు వేణు మళ్లీ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందంటున్నారు. ఆయన ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో వేణు సక్సెస్ అయ్యేనా అనేది చూడాలి.