Begin typing your search above and press return to search.
బచ్చన్ ఫ్యామిలీ నుంచి మహేష్ ని మించినోడు!
By: Tupaki Desk | 13 Dec 2022 1:30 AM GMTసూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎనిమిది పదుల వయసులో ఇప్పటికీ బాలీవుడ్ లో తన స్థానం చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ ముందుకు సాగడం అనన్య సామాన్యం. ఎదిగే వయసులో ట్యూబర్ క్లోసిస్ (టీబీ) తో పాటు కాలేయానికి సంబంధించిన ఎన్నో రుగ్మతలను ఎదుర్కొన్న అమితాబ్ హీరోగా ఎదిగేందుకు అహోరాత్రులు శ్రమించారు. అతడు ఏటికి ఎదురీదిన యువకుడన్న సంగతి అభిమానులకు మాత్రమే తెలుసు. ఎలాంటి సినీనేపథ్యం లేకుండా ఎదిగిన గొప్ప స్టార్ అతడు. అందుకే అమితాబ్ లెగసీని ముందుకు నడిపించేందుకు ఎవరొస్తారు? అన్న ప్రశ్న ఎప్పటికీ జవాబు లేనిదిగా మిగిలిపోయింది.
నటవారసుడు అభిషేక్ బచ్చన్ అమితాబ్ స్థాయిని అందుకోవడంలో తడబడ్డాడు. కెరీర్ పరమైన ఇబ్బందులేవీ లేకపోయినా అభిషేక్ నుంచి బిగ్ బి అభిమానులు ఆశించినది దక్కలేదనడం అతిశయోక్తి కాదు. అంచనాలను అందుకోవడం లో అభి విఫలమయ్యాడు. కొన్ని క్లాసిక్ అనిపించే సినిమాలు తప్ప అభిషేక్ బచ్చన్ భారతదేశపు అతి గొప్ప స్టార్లలో ఒకడిగా ఎదగలేకపోయాడు. అందుకే ఇప్పుడు బిగ్ బి ఫ్యామిలీ నుంచి లెగసీని నడిపించే వారసుడి అవసరం బాలీవుడ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పటికే కొత్త హీరోలు అసాధారణంగా రాణిస్తూ దూసుకుపోతుంటే అమితాబ్ కుటుంబం నుంచి చెప్పుకోదగ్గ నటుడు లేకపోవడం అతిపెద్ద లోటుగా అభిమానులు భావిస్తున్నారు. ఇటు బిగ్ బికి సౌత్ లోను అసాధారణంగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆ కుటుంబం నుంచి ఒక సల్మాన్ లేదా కనీసం కార్తిక్ ఆర్యన్ లాంటి హీరో అయినా లేడన్న కలత అలానే ఉంది. అందుకే ప్రతి నిత్యం వార్తల్లో అతడి ఇంటి గురించిన వార్తలు సంచలనంగానే మారుతుంటాయి. ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా అమితాబ్ మనవడు ఔత్సాహిక డెబ్యూ నటుడు అగస్త్య నందా నిలుస్తున్నాడు.
అగస్త్య తాతగారి లెగసీని ముందుకు నడిపిస్తాడంటూ ఇప్పుడు విశ్లేషణలు ముంబై మీడియాలో ఊపందుకుంటున్నాయి. అంతేకాదు.. ఈ యువకుడు చాలా అందగాడు. ఆరడుగుల ఆజానుబాహుడు. అతడు అమితాబ్ కుమార్తె శ్వేతబచ్చన్ నందా కుమారుడు. అభిషేక్ బచ్చన్ కి స్వయానా మేనల్లుడు. ఈ యువకుడి స్ఫురద్రూపం చూడగానే దక్షిణాది అభిమానులు అయితే అతడిని మహేష్ అంతటి అందగాడు అని కీర్తించకుండా ఉండలేరు. అతడి తీరైన రూపం వాచకం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయన్న ప్రశంసలు దక్కుతున్నాయి. అంతేకాదు అగస్త్య నందా తాత అమితాబ్ బచ్చన్ లెగసీని సమర్థంగా ముందుకు నడిపించగలడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
తాజా సమాచారం మేరకు అగస్త్య నందా డెబ్యూ సినిమా ప్రారంభం కావడానికి ఇంకెంతో సమయం పట్టదు. అతడు ఇక్కీస్ అనే చిత్రంలో అవకాశం అందుకున్నాడు. శ్రీరామ్ రాఘవన్ లాంటి ప్రతిభావంతుడు వార్ ఎపిక్ డ్రామా కథాంశంతో అగస్త్యను సంప్రదించడంతో ఈ మూవీపై మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. ఇది వార్ నేపథ్యంలోని బయోపిక్ అని ఒక సైనికుడి జీవితకథ అని తెలిసింది. నిజానికి ఈ సినిమాలో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించాల్సి ఉండగా అతడు 'వయసు అడ్డంకి' అనే కారణంతో తప్పుకున్నాడు. అనంతరం ఆ అవకాశం టీనేజర్ అయిన అగస్త్యను వెతుక్కుంటూ వచ్చిందని తెలిసింది. ఈ చిత్రానికి దినేష్ విజన్ నిర్మాత. కారణం ఏదైనా కానీ 'ఇక్కిస్' లాంటి ప్రతిష్ఠాత్మక బయోపిక్ చిత్రంలో వరుణ్ ధావన్ స్థానంలో అగస్త్య నందా నటిస్తుండడం బిగ్ బి ఫ్యాన్స్ లో చర్చకు తావిచ్చింది.
ఇక ఈ మూవీ నుంచి వరుణ్ ధావన్ తప్పుకోవడానికి కారణం వయసు ప్రధాన కారణమని తెలిసింది. 'పరమవీర చక్ర విజేత' సైనికుడు అరుణ్ ఖేతర్ పాల్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. 21 ఏళ్ల వయసులో మన దేశాన్ని రక్షించే పోరాటంలో ఈ యువకుడు వీరమరణం పొందాడు. ఇప్పుడు అగస్త్య మాత్రమే ఈ పాత్రకు సరిపోతాడని దర్శకనిర్మాతలు భావించారట.
వరుణ్ ధావన్ కి ఇప్పుడు 35 ఏళ్లు. కాబట్టి వయసు దృష్యా అతడిని ఎంపిక చేయడం సరికాదనే టాపిక్ వచ్చింది. బయోపిక్ లో పాత్రతో ధావన్ సరిపోలడం లేదు. మూడేళ్ల క్రితం ఇక్కీస్ ని ప్రకటించినప్పుడు శ్రీరామ్ మాత్రం వరుణ్ దావన్ తో తీస్తానని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అందరూ అరుణ్ ఖేతర్ పాల్ పాత్రలో నటుడి వయసు చాలా కీలకమని విశ్లేషిస్తూ శ్రీరామ్ పై ఒత్తిడి తెచ్చారట. అరుణ్ ఖేతర్ పాల్‌గా నటించడానికి అగస్త్యది సరైన వయస్సు. అంతేకాకుండా ఈ టీనేజీ యువకుడు చాలా ప్రతిభావంతుడు కావడంతో అతడు వెంటనే ఎంపిక చేసారని తెలుస్తోంది. ఎనభై వయసులో అమితాబ్ కి అంతులేని ఆనందాన్నిచ్చిన వార్త కూడా ఇది. బహుశా ఈ వారియర్ బయోపిక్ తో 'యూరి'తో విక్కీ కౌశల్ కి వచ్చినంత పేరు అగస్త్య నందాకు వస్తుందనే 'తుపాకి' ఆశిస్తోంది...
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.