Begin typing your search above and press return to search.

వాజీ వాజీ వాజీ .. నువ్వేనా ఇది ఓ శ్రీయా

By:  Tupaki Desk   |   5 Sep 2020 5:32 PM GMT
వాజీ వాజీ వాజీ .. నువ్వేనా ఇది ఓ శ్రీయా
X
అందాల శ్రీ‌య ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. క‌థ‌క్ నృత్యంలో శ్రీయ ఎంత స్పెష‌లిస్టో తెలిసిందే. రొటీన్ గా క‌మ‌ర్శియ‌ల్ సాంగ్స్ కి స్టెప్పులేసినా.. వాటిలో ఒక టింజ్ ఉంటుంది. శ్రీయ కు ఉన్న క్లాసిక్ డ్యాన్స్ స్కిల్ వ‌ల్ల‌నే ఇదంతా పాజిబుల్. అంతేకాదు.. ఇప్పుడున్న ఠ‌‌ఫ్ కాంపిటీష‌న్ లోనూ ఇన్నాళ్ల పాటు త‌న‌ని తాను నాయిక‌గా నిల‌బెట్టుకుంది అంటే త‌న‌కు మాత్ర‌మే తెలిసిన కొన్ని వైబ్రేంట్ అప్పియ‌రెన్స్ కి చెందిన‌ స్కిల్స్ వ‌ల్ల‌నే.

ఇదిగో అలాంటిదే ఈ లుక్. మెరూన్ రెడ్ డిజైన‌ర్ డ్రెస్ లో శ్రీయ అంద‌చందాలు ఔరా! అనిపిస్తున్నాయి. ఇక ఈ భామ 35 ప్ల‌స్ లోనూ అదిరిపోయే లుక్ తో క‌నిపించి మైమ‌రిపిస్తోంది. శ్రీయ న‌వ్వితే చాలు.. యూత్ ప‌రేషాన్ అయిపోతారు. అలాంటిది ఇలా గౌర‌వ్ గుప్తా డిజైన‌ర్ డ్రెస్ లో త‌ళాంగుత‌ళుకులు ప్ర‌ద‌ర్శిస్తే జ‌నం ఊరుకుంటారా?

వాజీ వాజీ వాజీ అంటూ `శివాజీ` సినిమాలో శ్రీయ స్టెప్పుల్నే గుర్తు చేసుకుంటున్నారు. గౌర‌వ్ గుప్తా డిజైన‌ర్ స్టోర్ ని లాంచ్ చేసిన సంద‌ర్భంగా శ్రీయ ఇలా ఎక్స్ ప్రెస్సివ్ గా ఫోజిచ్చింది. ఆ స్పెష‌ల్ మెరూన్ రెడ్ డ్రెస్ లో శ్రీయ‌ రాకుమారినే త‌ల‌పిస్తోంది. ముఖ్యంగా ఆ ఫేస్ లో చెర‌గ‌ని స్మైల్ త‌న‌కు ఎప్పుడూ ఆభ‌ర‌ణం లాంటిది. అన్న‌ట్టు భ‌ర్త ఆండ్రూ కోశ్చీవ్ తో విదేశాల్లో నిరంత‌రం షికార్ల‌తో బిజీగా ఉండే శ్రీయ ప్ర‌స్తుతం లోక‌ల్ గానే అందుబాటులో ఉన్న‌ట్టుంది. గోపాల గోపాల - గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి- సోగ్గాడే చిన్ని నాయ‌న త‌ర్వాత శ్రీయ‌కు స‌రైన ఆఫ‌ర్ రా‌లేదు. గ్యాప్ వ‌చ్చినా మ‌ళ్లీ టాలీవుడ్ లో అల‌రిస్తుందేమో చూడాలి.