Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : ఏజెంట్ అఖిల్.. కటౌట్ అదిరింది బాసు..!

By:  Tupaki Desk   |   21 Oct 2022 3:43 AM GMT
ఫోటో స్టోరీ : ఏజెంట్ అఖిల్.. కటౌట్ అదిరింది బాసు..!
X
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్టు ఖాతా తెరచిన అక్కినేని యువ హీరో అఖిల్ తన నెక్స్ట్ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చేస్తున్నాడు. ఏకె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీలో అఖిల్ తో సాక్షి వైద్య జోడీ కడుతుంది.

ఆమధ్య వచ్చిన టీజర్ తో మూవీ పై అంచనాలు పెంచాడు అఖిల్. చిరంజీవితో సైరా నరసింహా రెడ్డి మూవీ తర్వాత స్టార్ హీరోలు ఎవరు ఛాన్స్ ఇవ్వకపోవడంతో అఖిల్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు సురేందర్ రెడ్డి. వక్కంతం వంశీ ఇచ్చిన ఏజెంట్ కథతో వీరి కాంబో సెట్ అయ్యింది. ఈ మూవీ స్పై థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కుతుంది.

ఈ మూవీలో కండలు తిరిగిన దేహ దారుడ్యంతో అఖిల్ మెస్మరైజ్ చేయనున్నాడు. పర్ఫెక్ట్ షేప్ కోసం అక్కినేని హీరో చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. బ్యాచిలర్ మూవీతో రొమాంటిక్ హిట్ అందుకున్న అఖిల్ ఏజెంట్ తో మాస్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. సినిమా కోసం అఖిల్ పడిన కష్టం ఏంటి అన్నది అతని లుక్ చూస్తేనే అర్ధమవుతుంది.

ప్రస్తుతం ఏజెంట్ షూటింగ్ టైం లో దిగిన క్రేజీ ఫోటోని షేర్ చేశాడు అఖిల్. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా అఖిల్ డ్యాషింగ్ లుక్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ ఫోటోని ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసి త్రో బ్యాక్ అంటూ కామెంట్ పెట్టాడు అఖిల్. ఏజెంట్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కాగా సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

అఖిల్ ఈ మూవీ కోసం చాలా రిస్క్ తీసుకుని మరీ యాక్షన్ సీన్స్ చేసినట్టు అర్ధమవుతుంది. ఏజెంట్ మూవీకి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. అఖిల్ ఏజెంట్ మూవీలో మళయాళ స్టార్ మమ్ముట్టి కూడా నటిస్తున్నారు. మమ్ముక్క ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ ఏర్పడింది.

సాధారణంగా కథ నచ్చితేనే సినిమా చేసే మమ్ముట్టి ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఏజెంట్ మూవీని అసలైతే ఈ డిసెంబర్ లో రిలీజ్ అనుకుంటున్నారు. అయితే సంక్రాంతి సినిమాల రిలీజ్ కన్ ఫ్యూజన్ కొనసాగుతున్న సందర్భంగా అఖిల్ ఏజెంట్ కూడా పొంగల్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.