Begin typing your search above and press return to search.
మెగాస్టార్ తో ఢీ అంటే ఢీ అంటున్నారే
By: Tupaki Desk | 24 May 2022 11:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు `ఆచార్య`మూవీతో వచ్చారు. ఇందులోకి కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినా, అపజయమెరుగని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసినా ఈ మూవీ ఏమాత్రం ప్రేక్షకులని, అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల విడుదలైన ఈ చిత్రం చిరు కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా నిలిచి చేతు అనుభవాన్ని మిగిల్చింది. ఇదిఅలా వుంటే ఈ మూవీ ఫలితంతో కొంత నిరాశకు గురైన మెగాస్టార్ త్వరలో భారీ హిట్ తో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలని ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి `గాడ్ ఫాదర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన `లూసీఫర్` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాలని చిరు ప్లాన్ చేస్తున్నారట. ఈ రీమేక్ మూవీలోని కీలక పాత్రల్లో నయనతార, హీరో సత్యదేవ్ కనిపించబోతున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించారు.
దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళంలో సైపర్ హిట్ గా నిలిచిన సినిమా కావడంతో `గాడ్ ఫాదర్` అంతకు మించి విజయాన్ని సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని ఆగస్టులో ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ రిలీజ్ డేట్ ని ఇంత వరకు అధికారికంగా ప్రకటించకపోయినా ఆగస్టులో మాత్రం ఈ మూవీ రిలీజ్ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే ఇదే సమయంలో చియాన్ విక్రమ్ నటించిన `కోబ్రా` రిలీజ్ కు రెడీ అవుతోంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధిశెట్టి, మియా జార్జ్ హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీ ద్వారా ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటుడిగా పరిచయం అవుతున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించయిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. విక్రమ్ కూడా ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 11న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇదే బాటలో సమంత `యశోద` ఆగస్టు 12న రిలీజ్ కాబోతోంది.
అఖిల్ `ఏజెంట్` ని కూడా సరిగ్గా ఇదే రోజు రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఇక అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` కూడా ఆగస్టు 11నే రాబోతోంది. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. నాగచైతన్య ఇందులో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇలా ఆగస్టులో చిరు `గాడ్ ఫాదర్` తో ఢీ అంటే ఢీకి పలు సినిమాలు రెడీ అవుతుండటంతో ఆగస్టులో బాక్సాఫీస్ వద్ద పోటీ రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. ఈ పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారన్నది తెలియాలంటే ఆగస్టు సెకండ్ వీక్ వరకు వేచి చూడాల్సిందే.