Begin typing your search above and press return to search.

ఏజెంట్ ఆత్రేయ తమిళ రీమేక్.. హీరో ఎవరంటే?

By:  Tupaki Desk   |   30 Jan 2021 4:19 PM IST
ఏజెంట్ ఆత్రేయ తమిళ రీమేక్.. హీరో ఎవరంటే?
X
ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కిన బెస్ట్ సినిమాలలో ఒకటి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. నూతన దర్శకుడు ఆర్‌ఎస్‌జె స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ డిటెక్టివ్ థ్రిల్లర్.. అటు విమర్శకుల నుండి ఇటు ప్రేక్షకుల విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ మధ్య ఏ భాషలో అయినా సినిమా హిట్ అయితే తమ భాషలో రీమేక్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు హీరోలు.

పాపులర్ తమిళ కమెడియన్ సంతానం.. ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కామెడీ రోల్స్ చేసి హీరోగా మారిన సంతానం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఈ మూవీ తమిళ రీమేక్‌కు వంజాగర్ ఉలగం ఫేం మనోజ్ బీదా దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఇదివరకు సీరు, మజ్ను వంటి చిత్రాల్లో నటించిన రియా సుమన్ ఈ చిత్రంలో సంతానంతో కలిసి నటించనున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన కొద్ది రోజుల్లోనే వస్తుందని భావిస్తున్నారు. అయితే ఒరిజినల్ తెలుగు వెర్షన్ లో డిటెక్టివ్ ఆత్రేయ పాత్రలో నవీన్ పొలిశెట్టి యాక్టింగ్ ఇరగదీసాడనే చెప్పాలి. ఈ సినిమా హిట్ అవ్వడంలో నవీన్ యాక్టింగ్ ముఖ్యపాత్ర పోషించింది. మరి తమిళ వెర్షన్ లో సంతానం ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తాడో చూడాలి.

ఈ సినిమా కథకథనంతో పాటు కామెడీ పరంగా బాగా క్లిక్ అయింది. ఈ మధ్యకాలంలో సినీ అభిమానులు కూడా టేస్ట్ మార్చేశారు. రొటీన్ డబ్బా కొట్టుడు సినిమాలకు ఎప్పుడో సెలవు పెట్టేసారు. అందుకే కొత్తగా ఏ సినిమా వచ్చినా ఇట్టే ఆదరిస్తున్నారు. సంతానం చివరిగా బిస్కోత్ అనే సినిమాలో నటించాడు. ప్రస్తుతం సభాపతి అనే మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఆత్రేయ రీమేక్ మొదలవుతుందని టాక్.