Begin typing your search above and press return to search.

`ఏజెంట్` కీల‌క షెడ్యూల్స్ పూర్త‌యిన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   16 Nov 2021 4:30 PM GMT
`ఏజెంట్` కీల‌క షెడ్యూల్స్ పూర్త‌యిన‌ట్లేనా?
X
అక్కినేని వార‌సుడు అఖిల్ క‌థానాయ‌కుడిగా స్టైలిష్ మేక‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో`ఎజెంట్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏజెంట్ లో అఖిల్ లుక్ ఇప్ప‌టికే సినిమాకి కావాల్సినంత ప్ర‌చారాన్ని తెచ్చి పెట్టింది. సిక్స్ ప్యాక్ లో అఖిల్ లుక్ సూప‌ర్బ్ అంటూ మంచి కామెంట్లు ప‌డ్డాయి. ఇదొక స్పై థ్రిల్ల‌ర్ . వైజాగ్ పోర్టులో వెలుగు చూసిన‌ హానీట్రాప్ నేప‌థ్య‌మ‌ని  జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే  కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని  నెల్లూరు జిల్లాలోని కృష్ణ‌ప‌ట్నం..విశాఖ ప‌ట్నం పోర్టులో షూట్ చేసారు.

హైద‌రాబాద్ లోనూ కొంత షూటింగ్ చేసారు. అక్టోబ‌ర్ నుంచి షూటింగ్ యూర‌ప్ లోని  బుడాఫెస్ట్ లో జ‌రుగుతుంది. ఇది లాంగ్ షెడ్యూల్ గా సాగింది. దాదాపు న‌వంబ‌ర్ మిడ్ వ‌ర‌కూ అక్క‌డే షూటింగ్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా యూనిట్ బుడాఫెస్ట్ షెడ్యూల్ ని కూడా పూర్తిచేసి హైద‌రాబాద్ కి తిరిగి వ‌చ్చేసింది. దీంతో మెజార్టీ పార్ట్ దాదాపు పూర్త‌యిన‌ట్లేన‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే  హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రార‌భం కానుంది. ఇక అఖిల్ ఇటీవ‌లే `మోస్ట్  ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` తో తొలి స‌క్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. కొవిడ్ కార‌ణంగా రిలీజ్ ప‌లుమార్లు వాయిదా ప‌డినా ఎట్టకేల‌కు స‌క్సెస్ అందుకున్నాడు.

దీంతో రెట్టించిన ఉత్సాహంతో `ఏజెంట్` షూట్ లో పాల్గొంటున్నాడు. సురేంద‌ర్ రెడ్డి సైరా న‌రసింహారెడ్డి త‌ర్వాత తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. సూరి గ‌త ట్రాక్ రికార్డ్...అకిల్ స‌క్సెస్ కిక్ న‌డుమ ఏజెంట్ రిలీజ్ అవుతుండ‌టంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అలాగే అఖిల్ ఇక‌పై సినిమాల స్పీడ్ కూడా పెంచే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ స‌క్సెస్ లేమితో బాధ‌ప‌డిన అఖిల్ కి  అది వ‌రించింది కాబ‌ట్టి న‌చ్చిన ప్రాజెక్ట్ ల్ని లైనప్ లోకి తీసుకొచ్చే అవ‌కాశం ఉంది.