Begin typing your search above and press return to search.

బుడాపెస్ట్ కి బ‌య‌ల్దేరుతున్న `ఏజెంట్`

By:  Tupaki Desk   |   9 Oct 2021 12:30 AM GMT
బుడాపెస్ట్ కి బ‌య‌ల్దేరుతున్న `ఏజెంట్`
X
అక్కినేని వార‌సుడు అఖిల్ క‌థానాకుడిగా స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `ఏజెంట్` తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆంధ్రాలో ఉన్న పోర్టుల‌న్నింటిని చుట్టేసింది. అక్క‌డ కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. నెల్లూరు కృష్ణ‌ప‌ట్నం పోర్టు..విశాఖ పోర్టు లో అఖిల్ పై యాక్ష‌న్ ఎపిసోడ్ల‌ను చిత్రీక‌రించారు. హైద‌రాబాద్ ఆర్ ఎఫ్ సీలో నూ కొన్ని కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించారు.

తాజాగా యూనిట్ యూర‌ప్ ప్లైట్ ఎక్క‌డానికి రెడీ అవుతోంది. బుడాఫెస్ట్ లో ఈనెల 20 నుంచి కీల‌క స‌న్నివేశాల్ని చీత్రీక‌రించే షెడ్యూల్ వేసిన ట్లు స‌మాచారం. ఈ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని యూనిట్ వ‌ర్గాల స‌మాచారం. ఇక `ఎజెంట్` సినిమా విష‌యానికి వ‌స్తే ఇదొక హనీట్రాప్ క‌థాశం అని.. ఇందులో అఖిల్ ఓ `ఏజెంట్` పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం.

ఇక అఖిల్ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` ఈనెల 15న రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డిన నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో ఆ తేదీకి రిలీజ్ చేయాల‌ని యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. విజయం అందుకుని కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలుపుకోవాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు.