Begin typing your search above and press return to search.

'ఏజెంట్' పోస్టర్: అఖిల్ చేతిలో KGF పెద్దమ్మనా..?

By:  Tupaki Desk   |   14 July 2022 11:30 AM GMT
ఏజెంట్ పోస్టర్: అఖిల్ చేతిలో KGF పెద్దమ్మనా..?
X
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ "ఏజెంట్". స్టైలిష్‌ మేకర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ రేపు సాయంత్రం 5:05 గంటలకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఓ యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇందులో అఖిల్ పోనీటైల్‌ తో స్టైలిష్‌ గా, డాషింగ్‌ గా కనిపిస్తున్నాడు. శరీరమంతా గాయాలతో ఉన్న యూత్ కింగ్.. గాట్లింగ్ గన్‌ తో ఫైరింగ్ చేస్తుండటాన్ని మనం చూడవచ్చు. అఖిల్ చేతిలో ఉన్న గన్ 'కేజీఎఫ్ పెద్దమ్మ' లేదా 'ఖైదీ' సినిమాలోని M51 ను గుర్తుకు తెస్తోంది. చూస్తుంటే ఈ సినిమాలో యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుందని అర్థం అవుతోంది.

'ఏజెంట్' సినిమాలో అఖిల్‌ ని సరికొత్తగా ప్రెజెంట్‌ చేస్తున్నాడు సురేందర్ రెడ్డి. గూఢచారి పాత్రకు అవసరమైన విధంగా తనను తాను మార్చుకోవడానికి అఖిల్ చాలా కష్టపడ్డాడు. అతను కోరుకున్న ఆకృతిని పొందడానికి కఠోర శ్రమ చేశాడు.

ఇప్పటికే 'ఏజెంట్' సినిమా నుంచి పోస్టర్స్ విశేష స్పందన తెచ్చకున్నాయి. కండలు తిరిగిన దేహంతో అఖిల్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో రేపు శుక్రవారం రాబోతున్న టీజర్ కోసం అక్కినేని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ టీజర్‌ ను విడుదల చేయనున్నారు. ఇది నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని తాజాగా వచ్చిన పోస్టర్ సూచిస్తోంది.

'ఏజెంట్' సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో ఎంతో స్టైలిష్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ చివరి దశలో ఉంది.

రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు సురేందర్2సినిమా పతాకాలపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర మరియు పతి దీపా రెడ్డి ఈ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

దర్శక రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించగా.. సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌ గా.., అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు.