Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఏజెంట్ ఆత్రేయ ఈజ్ ఇంటెలిజెంట్!

By:  Tupaki Desk   |   7 Jun 2019 5:06 PM GMT
ట్రైలర్ టాక్: ఏజెంట్ ఆత్రేయ ఈజ్ ఇంటెలిజెంట్!
X
నవీన్ పోలిశెట్టి.. కృతి శర్మ హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'.  ఈ చిత్రానికి దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే. ఈ సినిమాలో ఎప్పటికైనా డిటెక్టివ్ గా బ్రేక్ వస్తుందని ఎదురుచూసే ఔత్సాహిక డిటెక్టివ్ గా నవీన్ పోలిశెట్టి నటించాడు.
 
దాదాపు మూడు నిముషాల ట్రైలర్ మొదటి షాట్ నుంచే ఆకట్టుకునేలా ఉంది. నైట్ టైమ్ లో అంబులెన్స్ వెళ్తూ ఉంటే 'వారాయి వెన్నిలాయో' అని తమిళ వెర్షన్ 'మిస్సమ్మ' పాట ప్లే అవుతూ ఉండడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. సినిమాలన్నీ అయితే హైదరాబాద్ నేపథ్యంలోనో.. కాకపోతే వైజాగ్ నేపథ్యంలోనో సాగుతాయి. కానీ ఈ సినిమా కథను నెల్లూరు నేపథ్యంలో తయారు చేసుకోవడం డిఫరెంట్ గా ఉంది. అదే కొంచెం కామెడీ అనుకుంటే.. 'ఎఫ్ బీ ఐ నెల్లూరు' అని హీరో పరిచయం చేసుకోవడం.. వెజిటెబుల్ మార్కెట్ దగ్గర హెడ్ క్వార్టర్స్ ఉందని చెప్పడం వెరైటీగా ఉంది. ఏజెంట్ అని నవీన్ చెప్పగానే "ఎల్ఐసి ఏజెంటా.. సార్ ఈమధ్య ఏదో కొత్త పాలసి వచ్చిందటగా.. తీసుకోవడం మంచిదే అంటారా?" అని ఒక వ్యక్తి అడగడం కిరాక్.

ఏదో ఒక కేసు సాల్వ్ చేసినందుకు ఫీజుగా వెయ్యి నూట పదహార్లు అడగడం.. పోలీసు కానిస్టేబుల్ "దొంగతనమే 500 రూపాయలు" అంటూ నూట పదహార్లు నవీన్ చేతిలో పెట్టడం ఇలా నీరసంగా సాగుతూ ఉంటుంది హీరో డిటెక్టివ్ కెరీర్.  ఇలాంటి సమయంలో ఒక బ్రేక్ వచ్చే కేసు తగులుతుంది.. రేప్ అండ్ మర్డర్ కేస్. అక్కడి నుంచి సీరియస్ టర్న్.. సీరియస్ ఇన్వెస్టిగేషన్. ఇక ట్రైలర్ ఎండ్ లో నవీన్ చెప్పిన 'వీ ఆర్ హ్యావింగ్ ఎ ఫెంటాస్టిక్ ఆఫర్ సర్" అనే పొడవాటి నాన్ స్టాప్ డైలాగ్.. డైలాగ్ చివర్లో "ఫ్రెండ్స్ అందరికీ -ఏంట్రా ఇవాళ నువ్వు  ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నావు నువ్వు అనే కామెంట్స్ కుడా పడతాయి సార్" అనేది మాత్రం ట్రైలర్ మొత్తానికి హైలైట్.

ఓవరాల్ గా ట్రైలర్ మెగా స్టార్ చిరంజీవి సినిమా 'చంటబ్బాయి' లైన్లోనే ఉంది.  సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడు అదేమీ  నెగెటివ్ పాయింట్ అనుకోనవసరం లేదు.  హీరో నవీన్ ఇప్పటికే కొన్ని సినిమాల ద్వారా.. ఎఐబీ కామెడీ ద్వారా కొందరికి పరిచయం. ఈ సినిమాలో డిటెక్టివ్ క్యారెక్టర్ ను కూడా ఈజ్ తో చేశాడు.  మార్క్ రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.  ఓవరాల్ గా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది..సినిమాపై ఆసక్తి పెంచేదిగా ఉంది.  ఆలస్యం.. మీరందరూ ఆ పుస్తకాలు చదివిన ఇంటెలిజెంట్లేగా.. చూసేయండి..!