Begin typing your search above and press return to search.
పోస్టర్ టాక్: చంటబ్బాయిని గుర్తుకు తెస్తోందే..
By: Tupaki Desk | 15 July 2018 6:32 AM GMTటాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ కామెడీ మూవీస్ లో ‘చంటబ్బాయి’ ఒకటి. తిరుగులేని మాస్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి.. ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి నటించిన పూర్తి స్థాయి కామెడీ మూవీ అది. దిగ్దర్శకుడు జంధ్యాల అద్భుతమైన కామెడీతో ఆద్యంతం అలరించేలా ఆ సినిమాను తీర్చిదిద్దాడు. చార్లీ చాప్లిన్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన ఇలాంటి ప్రయత్నాలు తెలుగులో అరుదనే చెప్పాలి. ఐతే చాలా ఏళ్ల తర్వాత తెలుగులో ఈ టైపు సినిమా ఒకటి తెరకెక్కుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆ సినిమా పేరు.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ చిత్ర టైటిల్ లోగో పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. సుమంత్ తో ‘మళ్ళీ రావా’ చిత్రాన్ని నిర్మించిన ‘స్వధర్మ్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒక చిన్నస్థాయి డిటెక్టివ్ కథతో తెరకెక్కుతున్న కామెడీ మూవీ. ఒక చిన్న షాపు షట్టర్ మీద రాసి ఉన్న టైటిల్ చూస్తే ఫన్నీగా అనిపిస్తోంది. పైనేమో ‘ఎఫ్బీఐ నెల్లూరు’ అని.. కిందేమో ‘వుయ్ డోంట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్ ఇన్ ద యుఎస్ఎ’ అని రాసి పెట్టారు. హీరో డిటిక్టివ్ కార్యాలకు కూడా ఆషాడం ఆఫర్లు ఇచ్చే తరహా అని పక్కన పెట్టిన బోర్డును బట్టి అర్థమవుతోంది. దొంగతనం కేసైతే 20 శాతం.. తప్పిపోయిన వ్యక్తిని వెతికి పెట్టే కేసైతే 35 శాతం డిస్కౌంట్ ఇస్తారట. మ్యారేజ్ వెరిఫికేషన్.. జీవిత భాగస్వామి మోసం.. విడాకులు.. లాంటి కేసులన్నింటికీ రూ.3999 అంటూ ఒకటే రేటు కట్టారు. అసలు ఈ షాపు లొకేషన్ చూస్తేనే హీరో రేంజ్ ఏంటో అర్థమైపోతోంది. మొత్తానికి ఈ పోస్టర్ అయితే భలే ఫన్నీగా అనిపిస్తోంది. నవీన్ పోలిశెట్టి.. శ్రుతి శర్మ అనే కొత్త హీరో హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడైన స్వరూప్ రూపొందిస్తున్నాడు.