Begin typing your search above and press return to search.
వైజాగ్ పోర్ట్ లో `ఏజెంట్` స్పై ఆపరేషన్?
By: Tupaki Desk | 18 Sep 2021 7:31 AM GMTఅక్కినేని వారసుడు అఖిల్ కథానాయకుడిగా స్టైలిష్ ఫిలింమేకర్ సురెందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ పూర్తయింది. యూనిట్ కొద్ది రోజుల పాటు విరామం అనంతరం తాజాగా కొత్త షెడ్యూల్ ని ఏప పరిపాలనా రాజధాని వైజాగ్ లో ప్రారంభించబోతున్నారు. వైజాగ్ కోస్టల్ బెల్టు మొత్తాన్ని ఏజెంట్ చుట్టేయనున్నా డని సమాచారం. పోర్టు..సముద్రం నేపథ్యంలో తెరకెక్కించే సన్నివేశాలు సినిమాకు అత్యంత కీలకమని తెలిసింది. వైజాగ్ లో లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారని సమాచారం. ఈ నెలాఖరు నుంచి అఖిల్ ఏజెంట్ చిత్రయూనిట్ తో జాయిన్ అవుతాడు. అన్నట్టు ఏజెంట్ ప్రత్యేకించి వైజాగ్ పైనే దృష్టి సారించడానికి కారణమేమిటి? ఇందులో హనీట్రాప్ ని కీలకంగా చూపిస్తున్నారా? హనీ ట్రాప్ ఆపరేషన్ లో ఏజెంట్ రోల్ ఏంటి? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో మగువల్ని ఎరవేసి దేశ భద్రతకు సవాల్ విసురుతూ ఆర్మీ-నావీ అధికారుల్ని లోబరుచుకున్న `హనీట్రాప్` ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏజెంట్ ఆపరేషన్ దీనిపైనేనా? అంటూ డౌట్లు వ్యక్తమవుతున్నాయి. హనీ ట్రాప్ పై ఇప్పటికీ రక్షణ విభాగంలో విచారణ సాగుతుండడంతో ఏజెంట్ కి ఇది ప్లస్ అయ్యేందుకు ఛాన్సుంటుందని అంచనా. అయితే దీనిపై దర్శకుడు ఏదైనా హింట్ ఇస్తారేమో చూడాలి.
`సైరా నరసింహారెడ్డి` తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో దూసుకెళుతున్న సురేందర్ రెడ్డి ఏజెంట్ పైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అఖిల్ లాంచింగ్ జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ సరైన సక్సెస్ ఖాతాలో పడలేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ సహా అన్ని పనులు పూర్తిచేసి రిలీజ్ కు రెడీగా ఉన్నారు. అక్టోబర్ 8న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా లేకపోతే సినిమా విడుదలై చాలా కాలమయ్యేది. కానీ కరోనా కారణంగా ఇంత కాలం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు కూడా అదుపులోకి వస్తున్నాయి.
ప్రేక్షకులకు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆన్ లైన్ బుకింగ్స్ ని బట్టి అర్థమవుతోంది. బ్యాచిలర్ రిలీజ్ కి ఇంకా ఇవరై రోజులు సమయం ఉంది కాబట్టి ఈలోపు పరిస్థితులు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24న రిలీజ్ అవుతున్న అఖిల్ బ్రదర్ నాగచైతన్య లవ్ స్టోరీ గనుక హిట్ టాక్ తెచ్చుకుని..జనాలు థియేటర్లకు వెళ్తే గనుక `బ్యాచిలర్` కి ఓ రకమైన హుషారు వస్తుంది. కరోనా టెన్షన్ ని వదిలించుకుని జనం థియేటర్లకు వస్తే అది అందరికీ కలిసొస్తుందని భావిస్తున్నారు.
అఖిల్ పైనే ఇండస్ట్రీ కళ్లన్నీ!
అఖిల్ `ఏజెంట్` పైనే అందరి కళ్లు. స్పై పాత్రలో అతడి గెటప్ కి ఎలా ఉంటుందో ఇప్పటికే రివీల్ చేసి సర్ ప్రైజ్ చేశారు. అఖిల్ మేకోవర్ మైండ్ బ్లాక్ చేసింది. అతడు ఈ సినిమా కోసం చేస్తున్న హార్డ్ వర్క్ ఆశ్చర్యపరుస్తోంది. జిమ్ లో కసరత్తులతో `వీ- షేప్` లుక్ ని తెచ్చాడు. కండలు మెలితిరిగి నరాలు పొంగి కనిపిస్తున్నాయి. గుబురు గడ్డం పొడవాటి గిరజాల జుత్తుతో అఖిల్ హాలీవుడ్ స్టార్ నే తలపిస్తున్నాడు. ఇప్పటికే అతడి లుక్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రెడిట్ సూరి ఖాతాలోకే వెళుతుంది. ఇక ఏజెంట్ అనగానే ఈ సినిమా కచ్ఛితంగా బార్న్ ఫ్రాంఛైజీ తరహాలో జేమ్స్ బాండ్ సిరీస్ తరహాలో ఆద్యంతం రక్తి కట్టించే విన్యాసాలతో అలరించనున్నారని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్ డేట్ అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. ప్రస్తుతం ఏజెంట్ చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఇక అఖిల్ కి తనదైన సూచనలు సలహాలిస్తూ ఈ మూవీని సురేందర్ రెడ్డి గ్రిప్పింగ్ గా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏజెంట్ పూర్తి యాక్షన్ సినిమా .. ఛేజ్ లు యాక్షన్ గగుర్పొడిచే సాహస విన్యాసాలతో రక్తి కట్టనుంది. అఖిల్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. హాలీవుడ్ బార్న్ ఐడెంటిటీ రేంజ్ విజువల్స్ ని అభిమానులు ఊహించవచ్చు.
అక్కినేని వారసుడు అఖిల్ సక్సెస్ కోసం ఎంతగా శ్రమిస్తున్నాడో అతడి పట్టుదల చెబుతోంది. తనని తాను మార్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు. ఫెయిల్యూర్స్ ని పక్కనబెట్టి సక్సెస్ అనే ధ్యేయంతో పనిచేస్తున్నాడు. అఖిల్ ఏజెంట్ లుక్ కి గేమ్ ఆఫ్ థ్రోన్ లో కీలక పాత్ర ధారి అయిన జాన్ స్నోని పోలి ఉందని అంతా భావిస్తున్నారు. హెచ్ బీవో లో లైవ్ అవుతోన్న `గేమ్ ఆఫ్ థ్రోన్` సిరీస్ లో జాన్ స్నో పాత్రకు... వేషాధారణకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సరిగ్గా అదే లుక్ లో ఇప్పుడు అఖిల్ కనిపంచడంతో అక్కినేని వారసుడ్ని ఆ సీనియర్ స్టార్ తో పోల్చేస్తున్నారు. ఏజెంట్ కి అన్ని వైపులా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.