Begin typing your search above and press return to search.
నారీ నారీ నడుమ ఏజెంట్ విన్యాసాలు
By: Tupaki Desk | 5 Nov 2021 5:11 AM GMTఅక్కినేని అఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముందే ఊహించినట్టుగానే అతడు తన కెరీర్ నాలుగో సినిమాతో విజయం అందుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అతడికి సంతృప్తికరమైన విజయాన్ని ఇచ్చింది. కరోనా క్రైసిస్ లోనూ ఈ సినిమా ఆశించిన విజయం సాధించడం అక్కినేని కాంపౌండ్ లో ఉత్సాహాన్ని పెంచింది. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంతోనూ బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఇండస్ట్రీలో తన ర్యాంక్ ని మెరుగుపరుచుకునేందుకు యువహీరో అఖిల్ కలలుగంటున్నాడు.
ఇక ఈ చిత్రంలోనూ కథానాయికలతో ఘాటైన రొమాన్స్ కి అఖిల్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని .. తీర ప్రాంతంలో పోర్ట్ ఏరియాల్లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇద్దరు హాట్ గాళ్స్ అఖిల్ తో రొమాన్స్ చేస్తారని సమాచారం. ఇప్పటికే ముంబై సూపర్ మోడల్ సాక్షి వైద్య కథానాయికగా ఎంపికైంది. మరో హీరోయిన్ గా తమిళ యువ నటి అతుల్య రవి ఖాయమైందని సమాచారం. సాక్షి వైద్యకు డెబ్యూ చిత్రం కాగా.. అతుల్య తమిళంలో ఇప్పటికే కథానాయికగా రాణిస్తోంది. అడుత సత్తై - నాడోడిగళ్ 2-కాదల్ కన్ కట్టుదే- యెమాలి వంటి తమిళ చిత్రాలలో కనిపించింది. ఎవరు మొదటి నాయిక ఎవరు రెండో నాయిక అన్నదానిపై ప్రస్తుతం గుసగుసలు వినిపిస్తున్నాయి.
కథానాయికల లుక్ లాంచ్ లకు సమయమాసన్నమైందని కథనాలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ - సురేందర్ 2 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూరి స్నేహితుడు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. స్పై థ్రిల్లర్ చిత్రాల్లో ఏజెంట్ అత్యంత రిచ్ లుక్ తో గ్రాండియర్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకి ఎంపిక చేసుకున్న లొకేషన్లు విజువల్ గా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.
బుడాపెస్ట్ షెడ్యూల్ దాదాపు పూర్తి
స్పై థ్రిల్లర్ మూవీ `ఏజెంట్` కి సంబంధించిన ప్రతి వార్తా అభిమానుల్లో సంచలనంగా మారుతోంది. ఇటీవల గత కొంతకాలంగా యూనిట్ ప్రస్తుతం హంగేరిలోని సుందరమైన యూరోపియన్ నగరమైన బుడాపెస్ట్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఆర్మీ ఆఫీసర్ గా అఖిల్ కి మెంటార్ గా కనిపించనున్నారు. తాజా అప్ డేట్ ప్రకారం.. మమ్ముట్టి పై బుడాపెస్ట్ లో కీలకమైన చిత్రీకరణను పూర్తి చేశారు. ఆయన ఇప్పుడు కొచ్చికి తిరిగి వచ్చారు. అఖిల్ -విదేశీ స్టంట్ మెన్ లతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్ ను కొనసాగించనున్నారు. ఆల్మోస్ట్ షెడ్యూల్ పూర్తయిందని సమాచారం. బ్యాచిలర్ సక్సెస్ నేపథ్యంలో ఏజెంట్ బిజినెస్ పైనా భారీ అంచనాలు పెరిగాయి.