Begin typing your search above and press return to search.

దిగులువాసి.. ప్రొడ్యూసర్ ఆఫ్‌ అజ్ఞాతవాసి

By:  Tupaki Desk   |   16 Jan 2018 9:21 AM GMT
దిగులువాసి.. ప్రొడ్యూసర్ ఆఫ్‌ అజ్ఞాతవాసి
X
దాదాపు 125 కోట్లకు అమ్ముడపోయిన ధియేట్రికల్ రైట్స్. తొలిరోజునే 40 కోట్లు షేర్ వచ్చేసింది అంటూ సంబరపడేలోపే.. రెండో రోజు 5 కోట్లకు పడిపోయిన షేర్ కలక్షన్. అక్కడి నుండి చూస్తే.. మొదటి వీకెండ్ పూర్తయ్యేనాటికి కేవలం 50 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఆ సినిమా పేరు అజ్ఞాతవాసి అయితే.. అభిమానులందరూ నిరాశవాసి.. ప్రొడ్యూసర్ మాత్రం బాగా దిగులువాసి అనాల్సిందే. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ఖరీదు అయిన మిస్టేక్ గా ఈ అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ ఉంటుంది అనే దానిలో డౌట్ లేదు..

పవన్ కళ్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్ డైరక్షన్లో వస్తున్న #pspk25 అంటే చాలా అంచనాలు ఉన్నాయి. కాని ఏం తీసినా జనాలు చూస్తే అనే ధోరణిలో గతంలో తాను తీసిన సీన్లనే త్రివిక్రమ్ తిప్పితిప్పి తీస్తే.. అది పప్పులో కాదు ఏకంగా పాతాళంలో కాలేసినంత పని చేయించింది. అయితే ఈ సినిమా ఫ్లాపవ్వడంతో అటు దర్శకుడు ఇటు హీరోకు ఎలాంటి లోటు ఉన్నా లేకపోయినా కూడా.. నిర్మాతకు మాత్రం దిగులు పట్టేసుకునేలా ఉంది. ఎందుకంటే షుమారు ఒక 70 కోట్ల నష్టం వాటిల్లుతుంది అన్నప్పుడు.. అసలు పంపిణీదారులు నిర్మాతను డబ్బులు వెనక్కి అడగకుండా ఉండరు. పైగా బాగా హైప్ క్రియేట్ చేసి కాస్త ఎక్కువరేట్లకే సినిమాను అమ్మేశారు కాబట్టి.. ఖచ్చితంగా కొంతమంది ఏదన్నా సీన్ క్రియేట్ చేసే ఛాన్సుంది. అలాగే నిర్మాతపై కూడా ఆ రేంజులో నష్టపోయిన డిస్ర్టిబ్యూటర్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది.

అందుకే ఇప్పుడు అజ్ఞాతవాసి ప్రొడ్యూసర్ దిగులువాసిగా మారాడని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్‌ సినిమా ప్రభావం నిర్మాత రాధాకష్ణ పై గట్టిగానే పడుతుంది. మనోడు తదుపరి చేయబోయే పెద్ద సినిమా ఎన్టీఆర్ తో కాబట్టి.. ఆ సినిమా టైములో ఈ లెక్కల సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మధ్యలో ప్రొడ్యూస్ చేస్తున్న ఇతర సినిమాల్లో అయినా ఆ పంపిణీదారులకు తక్కువ డబ్బులకు హక్కులు విక్రయించాల్సి వస్తుంది. అలా చేయకుండా ముందుకు కదలడం కష్టం. అలాగని ఇప్పుడు వాటిల్లిన 70 కోట్ల నష్టాన్ని పూరించడం కూడా కష్టమే. అయితే హీరో అండ్ డైరక్టర్ ను రెమ్యూనరేషన్లు వెనక్కి ఇచ్చేయమని అడగాలి.. లేదంటే పంపిణీదారులకు హ్యాండివ్వాలి. చూద్దాం ఏమవుతుందో!!


అజ్ఞాతవాసి ఫైవ్ డేస్ కలెక్షన్స్ :

వైజాగ్ : 4.71 cr
ఈస్ట్ : 3.32 cr
వెస్ట్ : 4.08 cr
కృష్ణ : 2.58 cr
నెల్లూరు : 1.98 Cr
గుంటూరు : 4.53 cr

టోటల్ ఆంధ్ర : 21.20 cr

సీడెడ్ : 4.45 cr
నిజాం : 9.25 cr
టోటల్ ఆంధ్ర అండ్ నిజాం : 34.90 cr
USA : 6.93 cr
కర్ణాటక : 6.02 cr
ఎస్టిమేటేడ్ రెస్ట్ అఫ్ ఇండియా అండ్ రెస్ట్ అఫ్ వరల్డ్ : 2.25 cr

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ : 50.1 Cr

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!