Begin typing your search above and press return to search.
పవన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడే..
By: Tupaki Desk | 18 Dec 2017 8:36 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో మాత్రమే కాదు.. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత దక్షిణాదిన అత్యంత భారీ ఫాలోయింగ్.. మార్కెట్ ఉన్న హీరో పవన్ కళ్యాణే అంటారు అభిమానులు. పవన్ సినిమాకు జరిగే బిజినెస్.. హిట్టయితే వచ్చే వసూళ్లు చూస్తే ఈ సంగతి నిజమే అనిపిస్తుంది. పవన్ సినిమాలకు సంబంధించిన టీజర్లు.. ట్రైలర్లు వస్తే సోషల్ మీడియా షేకైపోతుంటుంది. వ్యూస్.. లైక్స్ విషయంలో పాత రికార్డులన్నీ బద్దలవుతుంటాయి. ‘కాటమరాయుడు’ లాంటి అంతగా క్రేజ్ లేని సినిమాకు టీజర్ వదిలితే.. అది కూడా రికార్డుల మోత మోగించింది.
ఇప్పుడు పవన్ కొత్త సినిమా ‘అజ్ఞాతవాసి’ టీజర్ లాంచ్ చేస్తే అది కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అరగంటలో మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న టీజర్.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 64 లక్షల మంది ఈ టీజర్ చూశారు. కానీ సౌత్ ఇండియాలో ఒక్క రోజులో అత్యధికమంది చూసిన టీజర్ ఇది కాదు. ఆ విషయంలో అగ్ర స్థానం ‘మెర్శల్’ టీజరుదే. ఆ టీజర్ ను ఏకంగా 1.12 కోట్ల మంది చూశారు. దాని తర్వాత రెండో స్థానంలో నిలిచింది ‘అజ్ఞాతవాసి’ టీజర్. రెండో స్థానంలో ఉన్న మరో మరో తమిళ టీజర్ ‘వివేగం’ను ‘అజ్ఞాతవాసి’ అధిగమించింది. అజిత్ సినిమా టీజర్ 24 గంటల్లో 61 లక్షల వ్యూస్ సాధించింది. ఐతే లైక్స్ విషయంలో మాత్రం ‘అజ్ఞాతవాసి’ కొత్త రికార్డు నమోదు చేసింది. దీనికి 24 గంటల్లో 4.12 లక్షల లైక్స్ వచ్చాయి. ఒక్క రోజులో ఏ టీజరుకూ ఇన్ని లైక్స్ రాలేదు.