Begin typing your search above and press return to search.

సెన్సార్ టాక్: అజ్ఞాతవాసి అలా ఉందట

By:  Tupaki Desk   |   1 Jan 2018 3:58 PM GMT
సెన్సార్ టాక్: అజ్ఞాతవాసి అలా ఉందట
X
టాలీవుడ్ లో ప్రస్తుతం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వర్క్స్ ని ఇప్పటికే పూర్తి చేసుకుంది. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అజ్ఞాతవాసి అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతోన్న సినిమా. ఇక అమెరికాలో కూడా భారీ స్థాయిలో ప్రీమియర్స్ పడనున్నాయి.

ఇకపోతే రీసెంట్ గా అజ్ఞాతవాసి సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. మంచి ఫ్యామిలి ఎమోషనల్ సెంటిమెంట్ తో పాటు అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉండడంతో సెన్సార్ యూనిట్ U/A సర్టిఫికెట్ ను జారీచేసింది. సెన్సార్ టాక్ విషయానికి వస్తే.. సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టుగా పవన్ తన నటనతో విశ్వరూపం చూపించడాని తెలుస్తోంది. ఇక ఎప్పటిలానే త్రివిక్రమ్ మాటలు మైండ్ వరకు వెళ్లి గుండెల్ని తకుతాయట. త్రివిక్రమ్ ప్రతి ఫ్రెమ్ ని చాలా వినోదాత్మకంగా తెరకక్కించడమే కాకుండా మంచి మెస్సేజ్ ఇచ్చాడని చెబుతున్నారు.

మొత్తంగా సినిమాలో ఎక్కడా అశ్లీలత లేకుండా దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడని సెన్సార్ యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఇక మిగతా నటినటుల పెర్ఫామెన్స్ కూడా చాలా అక్కటుకుంటాయట. అనిరుధ్ పాటలు తెరపై మరింత సూపర్ గా ఉంటాయట. ఫైనల్ గా ఫైట్ సీన్స్ కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం పక్కా అని చెబుతున్నారు. మరి సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.