Begin typing your search above and press return to search.
అర్జున్ రెడ్డి రూట్లో అజ్ఞాతవాసి
By: Tupaki Desk | 6 Jan 2018 7:42 AM GMTఇంకా ట్రైలర్ రానే లేదు. ఈ రోజు సాయంత్రం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. హారికా అండ్ హాసిని అఫీషియల్ ఫేస్ బుక్ పేజిలో దీని గురించిన అప్ డేట్ ఇప్పటిదాకా ఏమి లేదు. కాని జరుగుతున్న ప్రచారం ప్రకారం సాయంత్రం విడుదల అవుతుందని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక అజ్ఞాతవాసి ప్రీమియర్లకు సంబంధించిన ఇన్ ఫర్మేషన్ లేక ఫాన్స్ పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. తాజాగా తెలిసిన సమాచారం మేరకు బుధవారం విడుదల ఉన్నా ముందు రోజు సెకండ్ షో నుంచే అజ్ఞాతవాసి ప్రదర్శన మొదలుపెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు దాదాపు దొరికినట్టే. ఆంధ్రలో ఈపాటికే రెగ్యులర్ షోస్ టికెట్ అమ్మకాలు మొదలు పెట్టగా హైదరాబాద్ ఆన్ లైన్ బుకింగ్ పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ డే కోసం ఒక్క హైదరాబాద్ సిటీ లోనే 109 థియేటర్లు పవన్ కోసం రెడీ చేసారు.మరికొన్ని ముందు రోజు యాడ్ అవుతాయి.
అర్జున్ రెడ్డి - బాహుబలి 2 కూడా ఇదే తరహాలో ముందు రోజు రాత్రి ప్రీమియర్ వేయటం చాలా హెల్ప్ చేసింది. వాటి నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ ఉదయానికంతా వైరల్ గా మారి కలెక్షన్స్ అమాంతం పెరగడానికి బాగా ఉపయోగపడింది. అజ్ఞాతవాసి మీద యూనిట్ ఎలాగూ గట్టి నమ్మకంతో ఉంది. తెల్లవారక ముందే రివ్యూలు - అభిప్రాయాలు ఆన్ లైన్ ను ముంచెత్తుతాయి అని తెలిసినా కూడా త్రివిక్రమ్ టీం దీనికే సిద్ధపడినట్టు సమాచారం. మరి ఈ షోలను ఏ థియేటర్స్ లో వేస్తారు - మీడియాకు మాత్రమేనా లేక పవన్ ఫాన్స్ కు కూడా వీటిలో చోటు ఉంటుందా అనేది తేలాలంటే సోమవారం దాకా ఆగాలి. మరో మూడు రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో టికెట్ల కోసం చాలా చోట్ల ఈ పాటికే లాబియింగ్ మొదలు పెట్టేసారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్న అజ్ఞాతవాసి బయటికి రావడానికి 90 గంటల కంటే తక్కువ టైమే ఉంది.