Begin typing your search above and press return to search.

బాహుబలి తరువాత అజ్ఞాతవాసే

By:  Tupaki Desk   |   10 Jan 2018 3:55 PM IST
బాహుబలి తరువాత అజ్ఞాతవాసే
X
ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న అజ్ఞాతవాసి ఫైనల్ గా అభిమానుల ముందుకు వచ్చింది. మొన్నటి వరకు సినిమా పై ఉన్న అంచనాలు సినిమా మీద కొంచెం ఎఫెక్ట్ చూపించినట్లే కనిపించింది. పవన్ అభిమానుల వరకు సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది పండగ తరువాత తెలుస్తుంది. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే సినిమా మంచి వసూళ్లనే రాబడుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ టాక్ కొంచెం తికమకపెడుతోంది.

ఇక అమెరికా కలెక్షన్స్ లో అయితే పవన్ కళ్యాణ్ తన సత్తాని చాటుకున్నాడు. నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. ప్రీమియర్స్ ద్వారానే డాలర్ల వర్షం కురిపించాడు. మొదట ప్రీమియర్స్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ ని చూసుకుంటే.. USD 1.487M రాబట్టింది. బాహుబలి 2 USD 2.450m మొదటి స్థానాన్ని అందుకోకపోయినా పవన్ తన రేంజ్ కి మించిన వసూళ్లను రాబట్టాడు. ఎందుకంటే బాహుబలికి అజ్ఞాతవాసికి చాలా తేడా ఉంది.

ఫైనల్ గా ఇప్పుడు అజ్ఞాతవాసి ప్రీమియర్స్ ద్వారా సెకండ్ ప్లేస్ ని అందుకుంది. ఆ తరువాత బాహుబలి 1 అలాగే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ఉన్నాయి. మొత్తంగా ఒకసారి యూఎస్ ప్రీమియర్స్ బాక్స్ ఆఫీస్ లెక్కలను చూస్తే..

బాహుబలి 2 - USD 2.450M

అజ్ఞాతవాసి - USD 1.487M

బాహుబలి 1 - USD 1.36M

ఖైదీ నెంబర్ 150 - USD 1.29M