Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసికి అక్కడ అన్యాయమే

By:  Tupaki Desk   |   9 Jan 2018 2:30 AM GMT
అజ్ఞాతవాసికి అక్కడ అన్యాయమే
X
నేను ప్రశ్నిస్తాను గాని..ఇతరులు నన్ను ప్రశ్నించవద్దు..అనేలా ఈ మధ్య ఓ క్రిటిక్ స్టార్ హీరోపై విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలో అజ్ఞాతవాసి సినిమాపై కూడా తమిళ సినిమా తిక్కగా ప్రవర్తిస్తోంది. మేము చేస్తాం గాని మీరు చెయ్యకూడదు అనేలా కత్తి లాంటి తిక్కతో కామెంట్స్ చేస్తోంది. టాలీవుడ్ లో పండగలకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా మంచి వసూళ్లను రాబడుతాయని అందరికి తెలిసిన విషయమే.

మ్యాటర్ ఏంటంటే.. తమిళ్ సినిమాలు కూడా పండగలు ఉంటే తెలుగులో బారి స్థాయిలో రిలీజ్ అవుతాయి. ఇప్పుడు సంక్రాంతి కి కూడా సూర్యా గ్యాంగ్ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వరకు తమిళ సినిమాలు ఇక్కడ రిలీజ్ అయితే ఎంత మాత్రం ఒప్పుకోమని వాటిని పండగ సమయంలో అడ్డుకుంటామని బడా నిర్మాతలే చెప్పి వారే డబ్బింగ్ సినిమాలను తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాల లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి సినిమాని కోలీవుడ్ లో రిలీజ్ చేస్తుంటే.. అక్కడ కమిటీలు ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ సినిమాలకు అక్కడ మార్కెట్ బాగానే ఉంది. ముఖ్యంగా అజిత్ - విజయ్ ఫ్యాన్స్ పవన్ సినిమాలను బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వారి సినిమాలను పవన్ రీమేక్ చేశాడు గనక. ఇక విజయ్ కూడా పవన్ ను చాలా ఇష్టపడతాడు. దీంతో స్టార్ హీరోల అభిమానులను సంపాదించుకున్న పవన్ సినిమా ఎంతో కొంత లాభం ఇస్తుందని ఓ బయ్యర్ మంచి రేట్ కి కొని రిలీజ్ చేసుకుంటున్నాడు. అయితే అక్కడ 10వ తేదీన కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో చాలా వరకు అజ్ఞాతవాసి థియేటర్స్ ని తగ్గించేశారు. కేవలం 2 రోజులకు గాను 100 నుంచి 125 వరకు స్క్రీన్స్ ను ఇస్తున్నారు. మల్టి ప్లెక్స్ లు అయితే అసలే ఇవ్వమని అంటున్నారు.

దీంతో బయ్యర్ కొంచెం కష్టకాలంలోనే పడ్డాడు. కానీ మన దగ్గర మాత్రం వారానికి పైగానే తమిళ్ సినిమాలకు ఎక్కువగా ఇస్తున్నాం. ఈ తరహా సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకోకుంటే అక్కడ కొందరు ఇలాగే రెచ్చిపోతారు. వాళ్లు హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు గాని మన సినిమాలు మాత్రం అలా రిలీజ్ చేసుకోవద్దని వాదిస్తున్నారు. మరి ఈ తరహా చర్యపై మన నిర్మాతలు ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే.. అక్కడ కోలీవుడ్ సినిమాలను తక్కువ రేటుకి కొని ఇక్కడ గట్టిగా వెనకేసుకుంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు.