Begin typing your search above and press return to search.
మహేష్ కు అజ్ఞాతవాసి సెంటిమెంట్
By: Tupaki Desk | 6 March 2018 11:30 PM GMTమహేష్‌కు అజ్ఞాతవాసి సినిమాకు ఏం సెంటిమెంట్ ఉంది? ప్రత్యక్షంగా చూస్తే ఏం సెంటిమెంట్ లేదు కానీ... పరోక్షంగా ఓ సెంటిమెంట్ కనిపిస్తోంది. అదేంటంటే... పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి... మహేష్ పాతికవ సినిమా త్వరలో విడుదలవ్వ బోతోంది. కొంతదీపి అజ్ఞాతవాసి మళ్లీ రిపీట్ అవుతుందేమోనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అను నేను సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా దాదాపు పూర్తయిపోయింది. ఏప్రిల్ 20న విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఆ తరువాత మహేష్ 25వ సినిమా షూటింగ్ మొదలవుతుంది. వంశీ పైడిపల్లి దీని దర్శకుడు. షూటింగ్ అతి త్వరలో మొదలుకాబోతోంది. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా గురించి ఏవోవో సెంటిమెంట్లు... గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ 25వ సినిమా అయిన అజ్ఞాతవాసి ప్రెంచ్ సినిమా కాపీ. ఆ కథ రాసింది బెల్జియన్ కు చెందిన రచయిత. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. ఇప్పుడు మహేష్ 25వ సినిమా కథ కూడా విదేశీ రచయితదే. విదేశీ రచయితల కథలు మనకి అచ్చి వచ్చినట్టు కనిపించడం లేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. ఆ సినిమా మరో అజ్ఞాతవాసి అవుతుందేమోనని వారి భయం.
మరొక వాదన కూడా వినిపిస్తోంది... అజ్ఞాతవాసి ఫ్లాపయిందని...అన్నింటి ఫలితం అలాగే ఉండాలని లేదు. ఎన్నో హిట్టయిన సినిమాలకు స్టోరీ లైన్ ఎక్కడి నుంచో కాపీ కొట్టింది. ఎక్కువగా హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టిందే. కనుక హిట్టయిన సినిమాలు ఉన్నాయి కనుక... వాటిని చూసి ధైర్యం తెచ్చుకోవడమే అంటున్నారు సినీ జనాలు.