Begin typing your search above and press return to search.

ఆహా! మిలియన్‌ డౌన్‌ లోడ్స్‌.. మరి ఆదాయం?

By:  Tupaki Desk   |   1 April 2020 11:30 PM GMT
ఆహా! మిలియన్‌ డౌన్‌ లోడ్స్‌.. మరి ఆదాయం?
X
థియేటర్లకు కాలం చెల్లబోతుందని.. రాబోయేది అంతా కూడా ఓటీటీ కాలమే అనే ముందు చూపుతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ 'ఆహా’ అంటూ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఆహాను భారీ ఎత్తున లాంచ్‌ చేసిన ఆయన జనాల్లోకి తీసుకు వెళ్లడం.. దాన్ని లాభాల్లో నడిపించడం సాధ్యం కావడం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆహా ఒక ఫ్లాప్‌ వెంచర్‌ అని.. లాస్‌ వెంచర్‌ అంటూ సినీ వర్గాల్లోనే కొందరు అంటున్నారు.

ఆ కారణంగానే అల్లు అరవింద్‌ ఆహాపై ప్రస్తుతం పెట్టుబడి పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నట్లుగా చెబుతున్నారు. భారీ స్థాయిలో వెబ్‌ సిరీస్‌ లపై అల్లు వారు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. చేతిలో పెద్ద దర్శకులు ప్రముఖ నటులు ఉన్నా కూడా ఆహా కోసం వారిని అల్లు అరవింద్‌ ఉపయోగించుకోవడం లేదని కూడా కొందరు అంటున్నారు. ఆహా ప్రారంభించారు కనుక ఏదో అలా అలా నడుపుతున్నారు అంటూ కూడా కొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు.

ఈ సమయంలో ఆహా యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ లో మిలియన్‌ డౌన్‌ లోడ్స్‌ ను సొంతం చేసుకుంది అంటూ గొప్పగా ప్రకటించారు. తక్కువ సమయంలో ఆహాను మిలియన్‌ మంది ఆధరించారంటూ అల్లు వారు చెబుతున్నా కూడా ఆదాయం విషయంలో మాత్రం చాలా నిరుత్సాహంగా వారు ఉన్నారనే సమాచారం అందుతోంది. డౌన్‌ లోడ్స్‌ అయితే తీసుకుంటున్నారు కాని ప్రైమ్‌ మెంబర్స్‌ మాత్రం వారు కావడం లేదట. మిలియన్‌ మంది వినియోగదారులు ఉంటే అందులో ఎంత శాతం మంది ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ తీసుకున్నారనే విషయం మాత్రం ఆహా టీం వెల్లడించలేదు.

కనుక ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ తీసుకున్న వారు చాలా తక్కువ మంది అయ్యి ఉంటారని.. దాంతో చాలా తక్కువ ఆదాయం ఇప్పటి వరకు ఈ వెంచర్‌ కు వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆహా కొనసాగింపు కష్టమే అనే కామెంట్స్‌ కూడా కొందరు చేస్తున్నారు. కాని అల్లు అరవింద్‌ మాత్రం ఆహాను అంత సింపుల్‌ గా వదిలేయడని.. రాబోయే పది సంవత్సరాల్లో ఆహా టాప్‌ లో ఉండేలా ఆయన చేయగలడు అనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.