Begin typing your search above and press return to search.

‘ఆహా’ క్య్రాష్‌ పబ్లిసిటీ స్టంట్‌?

By:  Tupaki Desk   |   6 April 2020 3:30 AM GMT
‘ఆహా’ క్య్రాష్‌ పబ్లిసిటీ స్టంట్‌?
X
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఆధ్వర్యంలో ప్రారంభం అయిన ఆహా ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ కు ఆశించిన స్థాయిలో ఆధరణ దక్కడం లేదు అనేది మార్కెట్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఆహా కోసం అల్లు అరవింద్‌ ఖర్చు పెడుతున్నా కూడా దాని నుండి వచ్చిన.. వస్తున్న ఆదాయం నామమాత్రమేనట. విజయ్‌ దేవరకొండతో ఆహాకు ప్రమోషన్‌ చేయించినా కూడా ఫలితం పెద్దగా లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయినా కూడా ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.

ఆహా మొత్తంను అడల్డ్‌ కంటెంట్‌ తో నింపేసినా కూడా యూత్‌ ఆడియన్స్‌ మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది. ఇక తాజాగా ఆహా యాప్‌ క్రాష్‌ అయ్యింది. రెండు మూడు రోజుల పాటు పూర్తిగా యాప్‌ పని చేయలేదు అనే ప్రచారం జరిగింది. తాజాగా ఆహా యాప్‌ క్రాష్‌ పై కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కొందరు ఆహా క్రాష్‌ పబ్లిసిటీ స్టంట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆహాకు క్రాష్‌ అయ్యేంతగా ట్రాఫిక్‌ వచ్చి ఉండదని.. అమెజాన్‌.. నెట్‌ ప్లిక్స్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లు కోట్లల్లో సబ్‌ స్క్రైబర్స్‌ ను కలిగి ఉంటాయి. వాటికి రాని సమస్య ఆహాకు వచ్చింది అంటే ఎలా నమ్మాలి అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆహాకు ఆధరణ అమాంతం పెరిగిందనేది నిరూపించేందుకు అల్లు వారి మాస్టర్‌ ప్లాన్‌ అయ్యి ఉంటుందనేది కొందరి అభిప్రాయం. కాని కొందరు మాత్రం ఆహాకు అనూహ్యంగా ఒక్కసారిగా ట్రాఫిక్‌ పెరగడంతో క్రాష్‌ అయిన మాట వాస్తవమే అని.. ఆ టైంలో వెబ్‌ సైట్‌ లో ఆహాను చాలా మంది స్ట్రీమ్‌ చేశారంటూ చెబుతున్నారు. అసలు విషయం ఏంటో ఆ పై వాడికే తెలియాలి.