Begin typing your search above and press return to search.
దిగ్గజ ఓటీటీలకు ధీటుగా 'ఆహా'
By: Tupaki Desk | 23 Oct 2021 3:39 PM GMT100 శాతం తెలుగు కంటెంట్ తో వచ్చిన డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా'.. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందించడానికి కృషి చేస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటుగా స్పెషల్ టాక్ షో లు - ఒరిజినల్ సిరీస్ లను స్ట్రీమింగ్ పెడుతున్నారు. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడిచే ఈ ఫ్లాట్ ఫార్మ్.. దిగ్గజ ఓటీటీలకు ధీటుగా దూసుకుపోతుంది. ఆహా కు ప్రస్తుతం 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ లక్ష్యంగా పెట్టుకొని ఫ్రెష్ కంటెంట్ ని వీక్షకులకు అందిస్తోంది.
'ఆహా' ఓటీటీలో దసరా పండుగతో మొదలుపెట్టి సంక్రాంతి పండుగ వరకూ కొత్త సినిమాలు - వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ పెట్టడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు లేటెస్టుగా బ్లాక్ బస్టర్ 'లవ్ స్టొరీ' సినిమా ప్రసారం అవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ మీద ఘన విజయం సాధించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన 'లవ్ స్టోరీ' అదే స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. లైంగిక వేధింపులు - కుల వివక్ష వంటి తీవ్రమైన సమస్యలను తెర మీద ఆవిష్కరించిన ఈ చిత్రం మంచి స్పందన తెచ్చుకుంటోంది.
ఇదే క్రమంలో 'ఆహా' లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేయబోతున్న ''అన్ స్టాపబుల్'' అనే టాక్ షో టెలికాస్ట్ కానుంది. ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేసిన ఈ కార్యక్రమం నవంబరు 4వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఇన్నాళ్లూ వెండితెర పై తనదైన శైలి డైలాగ్స్ యాక్షన్ తో అలరించిన బాలయ్య.. ఈ షో ద్వారా స్మాల్ స్క్రీన్ మీద సందడి చేయనున్నారు. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేస్తూ బాలకృష్ణ వంటి స్టార్ హీరోతో చేసిన ఈ స్పెషల్ షో.. ఆహా కు మరిన్ని సబ్స్క్రైబర్స్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది.
ఇకపోతే రాబోయే రోజుల్లో తెలుగు ఓటీటీలో సరికొత్త సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. దసరా బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా కూడా ఆహా లోనే స్ట్రీమింగ్ కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని - పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రెండో వారంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
అలానే 'లక్ష్య' 'మంచి రోజులొచ్చాయి' 'డీజే తిల్లు' 'రొమాంటిక్' 'అనుభవించు రాజా' 'పుష్పక విమానం' 'గని' వంటి అప్ కమింగ్ సినిమాలు 'ఆహా' లో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితోపాటు 'సేనాపతి' 'భామా కలాపం' '3 రోజెస్' 'అన్యస్ ట్యుటోరియల్' 'అడల్టింగ్' 'ఇట్స్ నాట్ ఏ లవ్ స్టొరీ' 'సెగు టాకీస్' 'ఇంటింటి రామాయణం' 'కూబూల్ హై' 'సర్కార్' వంటి ఒరిజినల్స్ ని ఆహా రెడీ చేస్తోంది. ఇవన్నీ ఈ ఏడాది లోపు ఓటీటీలోకి వచ్చేస్తాయి. మొత్తం మీద ప్రాంతీయ ఓటీటీగా డిజిటల్ వరల్డ్ లోకి వచ్చిన ఆహా.. తెలుగు కంటెంట్ విషయంలో టాప్ లో నిలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు.