Begin typing your search above and press return to search.
'ఆహా' వచ్చే ఏడాదికి నెం.1 టార్గెట్
By: Tupaki Desk | 11 Oct 2021 2:30 PM GMTఇండియాలో ఓటీటీల ఆధరణ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఆహా మొదలు అయ్యింది. కరోనా కారణంగా ఓటీటీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగి పోయింది. సినిమా థియేటర్లు లేక పోవడంతో అందరు కూడా ఓటీటీలపై పడ్డారు. ఓటీటీ లో ఎంటర్ టైన్ మెంట్ కోసం ఖాతాదారులుగా మారడం మొదలు పెట్టారు. గత ఏడాదిన్నర కాలంలో ఇండియాలో ఓటీటీ యూసేజ్ ఏకంగా నాలుగు రెట్లు పెరిగినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది ఆరంభం అయిన ఓటీటీ భూమ్ కొనసాగుతూనే ఉంది. ఆహా ఆరంభంలోనే మంచి పేరు దక్కించుకుంది. గత ఏడాది నుండి వరుసగా చిన్న చిన్న సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఇంకా డబ్బింగ్ సినిమాలతో ఆహా నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత స్థాయి పెంచి ఆహా లో కంటెంట్ క్వాలిటీ పెంచారు. అనూహ్యంగా దక్కిన ఆధరణ మరియు తమ ఖాతాదారులు పెట్టుకున్న విశ్వాసంను నిలిపేందుకు గాను ఆహా వారు భారీ సినిమాల దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు లో అత్యధిక ఖాతాదారులు ఉన్న ఓటీటీగా ఆహా కాకుండా ఇతర ఓటీటీలు ఉంటాయి. కాని వచ్చే ఏడాదికి నెం.1 ఓటీటీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆహా లో మొన్నటి వరకు చిన్న సినిమాలు.. డబ్బింగ్ సినిమాలను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తూ వచ్చారు. పెద్ద సినిమాల జోలికి వెళ్లలేదు. కాని ఇప్పుడు పెద్ద సినిమాలను కూడా కొనుగోలు చేసేందుకు సిద్దం అవున్నారు. ఆహా ఖాతాదారుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు పోటీ ప్రపంచంలో మరింతగా ముందుకు వెళ్లాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అనే ఉద్దేశ్యంతో ఆహా వారు భారీ ఎత్తున సినిమాలను కొనుగోలు చేయడంతో పాటు టాక్ షో లు మరియు వెబ్ సిరీస్ లను కూడా చేస్తున్నారు. అమెజాన్ ఒరిజినల్స్ ను మించి వరుసగా మంచి కంటెంట్ తో వెబ్ సిరీస్ లను తీసుకు వచ్చేందుకు ఒక టీమ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఓటీటీ లో మంచి ఆధరణ దక్కించుకుంటున్న టాక్ షో లు మరియు ఇతర షో లను కూడా ఆహా లో తీసుకు రాబోతున్నారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఒక టాక్ షో ను ప్రకటించింది. ఆ ఒక్క టాక్ షో ఆహా ను ఎక్కడికో తీసుకు వెళ్తుందని నందమూరి అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఆహా వారు నెట్టింట చేస్తున్న పబ్లిసిటీ చూస్తుంటే బాలయ్య టాక్ షో పైసా వసూల్ ఖాయం అంటున్నారు. బాలయ్య షో కోసం అయిన ఆహా ఖాతాదారులు అవ్వాల్సిందే అని చాలా మంది భావిస్తున్నారట. ఇక ఆహా లో రాబోతున్న సినిమాల విషయానికి వస్తే ఈనెల 22న ఇటీవల సూపర్ హిట్ అయిన లవ్ స్టోరీ స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కూడా ఆహా లోనే రాబోతుందట. మారుతి దర్శకత్వంలో రూపొందిన మంచి రోజులు వచ్చాయి.. పూరి వారి రొమాంటిక్.. నాగశౌర్య లక్ష్య.. వరుణ్ తేజ్ గని.. ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం.. రాజ్ తరుణ్ అనుభవించు రాజా సినిమాలను కూడా ఆహా లో స్ట్రీమింగ్ చేసేందుకు హక్కులు కొనుగోలు చేయడం జరిగింది.
ఇవి కాకుండా వచ్చే ఏడాదిలో ఆహా సొంతంగా నిర్మిస్తున్న పలు వెబ్ సిరీస్ లు మరియు గేమ్ షో లు కూడా స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఖాతాదారులను కలిగి ఉన్న ఓటీటీ గా పేరు దక్కించుకుని నెం.1 గా నిలవాలనే ఉద్దేశ్యంతో ఆహా ఉంది. ఇప్పటికే ప్రకటించిన కంటెంట్ కు తోడు మరింత ఆసక్తికర కంటెంట్ ను ప్రకటిస్తే ఖచ్చితంగా ఆహా నెం.1 అవ్వడం ఖాయం అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఓటీటీ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.