Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరినీ `గాడ్` అంత టెన్షన్ పెట్టాడా?
By: Tupaki Desk | 1 Jun 2021 3:30 AM GMTఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ కి టైటిల్ చాలా ఇంపార్టెంట్. జనాల్ని తొలిగా ఆకర్షించే ప్రధాన ఎలిమెంట్ ఇదే కావడంతో దానిపై దర్శకనిర్మాతలు ఎంతో జాగ్రత్త వహిస్తారు. పదే పదే టైటిల్ విషయమై తర్జన భర్జన పడడం విభేధించడం వగైరా వగైరా చాలా సహజం.
ఆహాలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న `ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్` సిరీస్ టైటిల్ విషయమై నిర్మాత అల్లు అరవింద్ తో చిత్ర సమర్పకుడు.. వెటరన్ డైరెక్టర్ సురేష్ కృష్ణ విభేధించారట. టైటిల్ లో `గాడ్` అనే పదం ఉండకూడదనేది అరవింద్ వాదన. కానీ ఎంపిక చేసుకున్న కంటెంట్ కి న్యాయం జరగాలంటే గాడ్ అనేది టైటిల్లో ఉండాల్సిందేనని చిత్ర సమర్పకుడు సురేష్ కృష్ణ పట్టుబట్టారట. ఆ ఇద్దరి మధ్యా సుదీర్ఘంగా డిబేట్ రన్ అయ్యింది. చివరికి అరవింద్ రాజీకొచ్చారు. కానీ ఇప్పటికీ ఆయన గాడ్ అనేది వివాదాంశం అవుతుందని ఆందోళనలో ఉన్నారట. కానీ సురేష్ కృష్ణ మాత్రం తన పట్టుదలనే కొనసాగిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో విభిన్నమైన కథాంశం ఉన్న సిరీస్ ఇది. ఇందులో బిగ్ బాస్ ఫేం నందిని రాయ్- ప్రియదర్శి తదితరులు నటించారు. విద్యాసాగర్ ముత్తుకుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.