Begin typing your search above and press return to search.
#కరోనా ఉన్నా.. OTT లో `ఆహా` దూకుడేది?
By: Tupaki Desk | 26 March 2020 3:31 AM GMTకరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లను కుప్ప కూల్చింది. కార్పొరెట్ల రెగ్యులర్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇక సామాన్య జనం బయటకు రాకుండా స్వీయ నిర్భంధనం పాటిస్తుండడంతో ఆ ప్రభావం కూడా అన్ని మార్కెట్లపైనా పడింది. ఇకపోతే ఇలాంటి సన్నివేశం ఎవరికి కలిసి వస్తుంది? అంటే ఓటీటీ- డిజిటల్ వేదికకు కలిసొస్తుందని విశ్లేషిస్తున్నారు.
జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. పైగా వినోదం కోసం థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో టీవీ మాధ్యమాల్ని .. ఓటీటీ- డిజిటల్ ని ఆశ్రయించాల్సిన సన్నివేశం ఉంది. అయితే ఇది కొత్తగా ప్రారంభమైన స్థానిక ఓటీటీలకు ఏమైనా కలిసొస్తోందా? అంటే.. పెదవి విరిచేసే సన్నివేశమే కనిపిస్తోంది.
ఇటీవలే అగ్ర నిర్మాత అల్లు అవింద్ సారథ్యంలో `ఆహా- తెలుగు` ఓటీటీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే కార్పొరెట్ దిగ్గజాలు అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ వంటి వాటి నుంచి తీవ్రమైన పోటీ దృష్ఠ్యా ఆహాకు అంతగా ఆదరణ దక్కలేదు. ఉచితం అంటూ సబ్ స్క్రైబర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. ఇక లోకల్ ఓటీటీ అయినా.. లేక బడా ఓటీటీలు అయినా కంటెంట్ ని అందించేదానిని బట్టే రిజల్ట్ ఉంటుంది. ఇక ఆహాలో తక్కువ సినిమాలే ఉంటాయి కాబట్టి అటువైపు జనం ఆకర్షితులు కావడం కష్టమే. కరోనా ఎఫెక్టుతో ఇంట్లోనే ఉంటున్నా యూత్ ఎవరూ ఆహా యాప్ ని తెరచి చూస్తున్నారో లేదో అర్థం కాని పరిస్థితి. అష్ఠదిగ్భందనం వేళ.. ఆహా బాగా వెళ్లాలి. కానీ ఇంకా పెద్ద బజ్ ఏదీ లేదు. ప్రజలు వేరే ఓటీటీ వేదికలపై ఉన్నారు. ఇందులో మరీ ఎక్కువ సినిమాల్లేవ్. పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేనివే వస్తుంటే ఇక ఇటువైపు జనం ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఆహాలో అర్జున్ సురవరం తప్ప ఏమీ సినిమాల్లేవ్. ఏవో కరోనా వైరస్ ఎఫెక్టుతో..ఈ ఖాళీ సమయంలో కొంతమంది ఆల్రెడీ సబ్ స్క్రైబ్ అయిన వాళ్లు ఈ సినిమా చూశారు. ఇక ఆహాలో అత్యధిక ఆదరణ పొందిన సినిమా ఇదే.. 6.8 మిలియన్ వ్యూస్ వచ్చాయని టీమ్ ప్రకటించింది. ఇక ఉగాది రోజు ఈ సినిమానే చూడాల్సొచ్చింది వ్యూవర్స్. ఇది తప్పితే ఇంక పెద్దగా ఇందులో ఏవీ లేకపోవడంతో ఆదరణ నిల్ అయ్యింది. మరీ ఇలా కంటెంట్ పరంగా వెనకబడితే ఎలా..? ఏదైనా కొత్తగా ప్రారంభించేప్పుడు భారీగా కంటెంట్.. క్రేజీ సినిమాలతో బరిలో దిగాలి కానీ! అన్న విమర్శ ఎదురవుతోంది ఆహాకి. డిజిటల్ వీక్షకులు పెరిగేందుకు ఆహా టీమ్ ఏం చేస్తుందో చూడాలి.