Begin typing your search above and press return to search.
బాలయ్య 'అఖండ' విజయంలో భాగమైన 'ఆహా'..!
By: Tupaki Desk | 7 Dec 2021 10:32 AM GMTఇప్పుడు ఎక్కడ చూసినా సినీ అభిమానులు ''అఖండ'' సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్ల వైపుకు నడిపించిన సినిమా నిలిచింది. అందరూ ఊహించినట్లే బాక్సాఫీస్ కు నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా కళ తీసుకొచ్చింది.
థియేటర్ల వద్ద బ్యానర్స్ ఫ్లెక్సీలతో సెలబ్రేషన్లు.. థియేటర్లలో పేపర్లు విసురుతూ గోల గోల చేసే ఫ్యాన్స్ హంగామా వంటివి ''అఖండ'' సినిమాతోనే మళ్లీ మొదలయ్యాయి. రెండో వేవ్ పాండమిక్ తర్వాత విడుదలైన పెద్ద సినిమాగా.. టాలీవుడ్ అంతా ఎదురు చూసినట్లే అఖండమైన విజయాన్ని నమోదు చేసింది.
తెలుగు రాష్ట్రాలతోపాటు ఖండ ఖండాలలో హవా కొనసాగిస్తూ 'అఖండ' సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 80 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూఎస్ఏ లో ఈ చిత్రం 800K డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం.
అయితే 'అఖండ' విజయానికి కథ కథనం ఇలాంటివి ఏ మేరకు దోహదం చేసాయనేది పక్కన పెడితే.. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా కోరుకుందనేది వాస్తవం. టాలీవుడ్ స్టార్ హీరోలు - నందమూరి అభిమానులతో అందరి హీరోల ఫ్యాన్స్ బాలయ్య సినిమా ఆడాలని కోరుకున్నారు. దీనికి ప్రింట్ మీడియా - వెబ్ మీడియా - సోషల్ మీడియా కూడా తన వంతు సపోర్ట్ ఇచ్చింది.
ఇప్పటికే కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పరిశ్రమ తిరిగి పుంజుకోవాలంటే విడుదలయ్యే సినిమాలు ప్రజాదరణ పొందాలి. అందుకే 'అఖండ' లాంటి పెద్ద చిత్రం రాబోయే భారీ సినిమాలకు నాంది అవుతుందని అందరూ భావించారు. అందులోనూ ఏపీలో టికెట్ రేట్లు - అదనపు షోలకు అవకాశం ఇవ్వకపోవడం వంటి అంశాలు టాలీవుడ్ మీద జానాల్లో సానుభూతి కలిగేలా చేశాయని తెలుస్తోంది.
ఇవన్నీ ఒక ఎత్తైతే బాలకృష్ణ మీద జనాల అభిప్రాయాన్ని మార్చేసిన ''అన్ స్టాపబుల్'' టాక్ షో కూడా 'అఖండ' విజయానికి కారణమని చెప్పవచ్చు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలో నడిచే తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం బాలయ్య హోస్టుగా తొలిసారిగా డిజిటల్ వేదికపై అడుగుపెట్టారు. దెబ్బకు అందరి థింకింగ్ మారిపోవాలనే లైన్ తో వచ్చిన ఈ ప్రోగ్రామ్ బాలకృష్ణపై థికింగ్ ని పూర్తిగా మార్చేసింది.
సాధారణ ప్రేక్షకులలో బాలకృష్ణ అంటే కోపదారి మనిషి - ఆవేశపరుడు అనే అభిప్రాయాలు ఉన్నాయి. పబ్లిక్ మీటింగ్స్ లో కోపగించుకోవడాలు.. అభిమానులను, పార్టీ కార్యకర్తలను చెంప దెబ్బలు కొట్టడాలు వంటివి జనాల్లో అతనికి ఇలాంటి ఒపీనియన్ ఏర్పడటానికి కారణమయ్యాయి. అయితే ఆహా అన్ స్టాపబుల్ షో కంప్లీట్ గా కొత్త బాలయ్య ను.. ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
బాలకృష్ణ మొదటిసారిగా హోస్టింగ్ చేస్తున్నా.. హుందాగా జోవియల్ గా షో నడుపుతున్న విధానం అందరినీ ఆకర్షించింది. కూల్ గా తనపై తాను జోక్స్ వేసుకోవడమే కాకుండా.. ఎలాంటి మొహమాటం లేకుండా సొంత ప్లాప్స్ గురించి మాట్లాడటం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు నటసింహం ఇతర హీరోల డైలాగ్స్ చెప్పడం.. చిన్న పిల్లాడిగా మారి ఆట్లాడటం.. అల్లరి చేయడం వంటివి ఈ షోలో కనిపించాయి.
కోపం, బాధ, ప్రేమ, ఆనందం.. ఇలా ఏదైనా ఉన్నది ఉన్నట్లు వెంటనే చూపిస్తారని.. భావోద్వేగాలను అస్సలు దాచుకోలేరని 'అన్ స్టాపబుల్' వల్ల ఆడియన్స్ కు అర్థమైంది. అంతేకాదు ఇన్నాళ్లు బయటకు చెప్పుకోకుండా బసవతారకం ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలు ఈ షో ద్వారా అందరికీ తెలిసాయి. దీంతో అప్పుడప్పుడు కోపాన్ని ఫ్యాన్స్ మీద చూపించినా బాలయ్య మనసున్న వ్యక్తి అని.. ఆయనలో చాలా సాధారణ వ్యక్తి ఉన్నాడని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇలాంటి అంశాలే జనాలను థియేటర్లకు తరలి వచ్చేలా చేశాయి. ఈ క్రమంలోనే బాలయ్యకు అఖండమైన విజయాన్ని అందించారు. ఒక విధంగా చూసుకుంటే 'ఆహా' ఓటీటీ కూడా సినిమా సక్సెస్ లో భాగం ఇవ్వాలనే అనుకోవాలి. బాలయ్య పాపులారిటీని ఒక్కసారిగా పెంచడమే కాకుండా.. ఆయనలోని మరో కోణాన్ని జనాలకు చూపించింది. 'అఖండ' విడుదలకు ముందు 'అన్ స్టాపబుల్' టాక్ షో ని స్ట్రీమింగ్ పెట్టి.. సినిమా పబ్లిసిటీలో కూడా భాగమయ్యారు. సినిమా విజయంలో ఇవన్నీ సహాయపడ్డాయని అందరూ అంగీకరించాల్సిన వాస్తవం.
కాగా, బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ''అఖండ''. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇందులో ప్రజ్ఞా జైస్వాల్ కథానాయికగా నటించగా.. శ్రీకాంత్ - జగపతిబాబు - పూర్ణ - కాలకేయ ప్రభాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న ఈ సినిమా.. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.