Begin typing your search above and press return to search.
సీఎం చేతుల మీదుగా 'ఆహా' ఆరంభం..!
By: Tupaki Desk | 14 April 2022 9:30 AM GMT100% తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందిన ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ''ఆహా''. కరోనా మొదటి దశ సంక్షోభం సమయంలో పుట్టుకొచ్చిన ఈ డిజిటల్ వేదిక.. దిగ్గజ ఓటీటీలకు ధీటుగా నిలబడింది. వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ని అందిస్తూ విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంది.
బ్లాక్ బస్టర్ సినిమాలు - డబ్బింగ్ చిత్రాలు - వెబ్ సిరీస్ లతో పాటుగా స్పెషల్ టాక్ షోలు - గేమ్ షోలను స్ట్రీమింగ్ పెడుతూ డిజిటల్ వరల్డ్ లో నూతన ఒరవడి తీసుకొచ్చింది అచ్చ తెలుగు ఓటీటీ. అనతి కాలంలోనే విశేష ఆదరణతో సబ్ స్క్రైబర్స్ పెంచుకుంటూ పోతోన్న 'ఆహా'.. ఇప్పుడు తన ప్రసార సామ్రాజ్యాన్ని విస్తరించడం మీద దృష్టి పెట్టింది.
100 శాతం తమిళ కంటెంట్ ని అందించేలా 'ఆహా తమిళ్' ఓటీటీని ఆవిష్కరిస్తున్నారు. తమ కార్యక్రమాలను ఇతర భాషల్లోకి విస్తరింప చేయాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్న నిర్వాహకులు అల్లు అరవింద్ మరియు మై హోమ్ రామ్.. 2022 పొంగల్ సందర్భంగా 'ఆహా తమిళ్' ఓటీటీ ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో లోగో లాంచ్ కార్యక్రమాన్ని చెన్నయ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ క్రమంలో నేడు తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని నూరు శాతం తమిళ ఓటీటీగా 'ఆహా' ప్రసారాలను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నయ్ లీలా ప్యాలెస్ లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా తమిళ్ ఓటీటీ లాంచ్ అవబోతోందని నిర్వహకులు ప్రకటించారు.
''నేడు (2022, ఏప్రిల్ 14) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రేమికులకు "ఆహా" అనే ప్రత్యేకమైన తమిళ OTTని ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి తిరు M.K. స్టాలిన్ ఈ వేడుకను ఘనంగా నిర్వహించి, ఈ బిగ్ బాష్ లో 100% తమిళ వినోదానికి గర్వకారణమైన వారిని సత్కరిస్తారు. మాతో ఈ ప్రయాణాన్ని కిక్ స్టార్ట్ చేసే ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లను వెల్లడించడానికి కూడా మేము సంతోషిస్తున్నాము'' అని 'ఆహా' టీమ్ పేర్కొంది.
'ఆహా తమిళ్' ఓటీటీలో తమిళ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలను ఒరిజినల్ వెబ్ సిరీసులు మరియు టాక్ షోలను ప్రసారం చేయబోతున్నారు. తమిళనాట ఈ ఓటీటీ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. ఏదేమైనా 'ఆహా' నిర్వాహకులు అల్లు అరవింద్ & మై హోమ్ రామేశ్వర రావు ఉత్సాహం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతీయ భాషల్లో తమ ఓటీటీని విస్తరిస్తారని అనిపిస్తోంది.