Begin typing your search above and press return to search.
ఏడేళ్లపాటు వెయిట్ చేసిన అహల్య
By: Tupaki Desk | 27 July 2015 3:22 PM GMTమన బాలయ్య పక్కల లెజెండ్ లో మెరిసిన రాధికా ఆప్టే.. లేటెస్ట్ రిలీజ్ అహల్య. ఇదో బెంగాలీ షార్ట్ ఫిలిం. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో రూపొందించిన అహల్య... విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు సృష్టించింది. ట్రైలర్ లాంఛ్ నుంచే రాధిక అందాల పైనే కాదు... యాక్టింగ్ పైనా ఫుల్ క్రేజ్ పెంచేసింది.
అహల్య రిలీజ్ సందర్భంగా... ముంబై శాంతాక్రజ్ థియేటర్ దగ్గర సందడి చేసింది ఈ 29ఏళ్ల సుందరి. కోల్ కతాలో విడుదలకు డైరెక్టర్ హాజరైతే... ముంబై లో హడావిడి ఈ అమ్మడిదే. స్లీవ్ లెస్, వీనెక్ డిజైన్ ఫ్లోరల్ ఫ్రాక్ లో సబర్బన్ థియేటర్ కి వచ్చిన అహల్య... (సారీ) రాధిక.. సినిమాకు వచ్చిన స్పందనపై ఫుల్ హ్యాపీగా ఉంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో రూపొందుతున్న 8 సినిమాలు రిలీజ్ కు లైన్ లో ఉన్నాయంటే... ఆప్టే ఎంత స్పీడ్‌గా ఉందో అర్ధమవుతుంది.
ఇప్పుడీ స్పీడ్ కనిపిస్తోంది కానీ... దీనికి ముందు రాధిక కష్టం చాలా ఉంది. చదువుకునేప్పుడు 2005లో 'వాహ్ లైఫ్ హో తో ఐసీ'తో సరదాగా కెరీర్ ప్రారంభించినా... 2009నుంచి పూర్తిస్థాయిలో నటన ప్రారంభించింది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన రక్తచరిత్రతో... మనకి తెలియడమేకాదు... తన ట్యాలెంట్ ని పరిశ్రమకు తెలియచేసింది. 2014నుంచి భారీ సినిమాల హీరోయిన్ గాను ఎదిగిన ఆప్టేకి... ఇప్పటికి బ్రేక్ లభించినట్లైంది. అంటే రాధిక ఈ విజయం సాధించడానికి దాదాపు ఏడేళ్లు పట్టింది. ఇప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కరీనా కపూర్, కత్రినాలకు కూడా బ్రేక్ రావడానికి చాలా సమయమే అవసరమైంది. చూస్తుంటే... మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన సమంత.. అదృష్టవంతురాలు అనిపిస్తోంది కదూ.
అయితే రజనీకాంత్ సినిమా సంగతేంటంటే మాత్రం... బోల్డ్ గా బోలెడు బిల్డప్ ఇచ్చేసింది. ఇంతకంటే కఠినమైన ప్రశ్న తనకు ఎదురుకాలేదంటూ... ఫోజ్ కొట్టేసింది కూడా. ఇంకా టాక్స్ జరుగుతున్నాయని, ప్రాజెక్ట్ ఫైనల్ అయితే... తానే చెబ్తానంటూ చివర్లో ముక్తాయింపు ఇచ్చింది ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ.