Begin typing your search above and press return to search.
హిందీ ఆర్.ఎక్స్100 హీరో
By: Tupaki Desk | 15 Nov 2018 7:39 AM GMTఉరకలెత్తే ఉత్సాహంతో ఎనర్జీ చూపించే హీరోలకు అన్ని వేళలా ఆదరణ ఉంటుందనడంలో సందేహం లేదు. సరైన స్క్రిప్టు ఎంపికతో ఎనర్జిటిక్ హీరోలుగా నిరూపించుకుంటున్న నవతరం హీరోలకు యూత్ లో అద్భుతమైన క్రేజు నెలకొంటోంది. ఆ మాట కొస్తే టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజాకు సుదీర్ఘమైన కెరీర్ జర్నీ వెనక అతడి ఎనర్జీ లెవల్స్ ఓ కారణం. ఇడియట్ - విక్రమార్కుడు మొదలు `అమర్ అక్బర్ ఆంటోని` వరకూ రవితేజలో అదే ఎనర్జీ అతడిని విజయవంతంగా డ్రైవ్ చేసింది. ఇటీవల కాలంలో బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ గురించి అంతే ఇదిగా ముచ్చటించుకున్నారు. ఎనర్జీకి పర్యాయపదమైన రణవీర్ కెరీర్ ఖాన్ ల లెవల్ ని టచ్ చేస్తోంది.
అందుకే టాలీవుడ్ లోనూ అంతే ఉత్సాహంతో - ఎనర్జీతో ఎవరైనా కొత్త హీరో వస్తే మన ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. ఆ కోణంలో చూస్తే `అర్జున్ రెడ్డి`తో దేవరకొండ - ఆ తర్వాత `ఆర్ ఎక్స్ 100` చిత్రంతో కార్తికేయ గొప్ప ఎనర్జిటిక్ పెర్ఫామెన్సులతో ఆకట్టుకున్నారు. అర్జున్ రెడ్డి - ఆర్.ఎక్స్ 100 చిత్రాలను ఇరుగుపొరుగు భాషల్లో రీమేక్ చేసేందుకు అంతే ఎనర్జీ ఉన్న హీరోల్ని వెతికారు దర్శకులు.
ప్రస్తుతం ఆర్.ఎక్స్ 100 చిత్రాన్ని హిందీ - కన్నడలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు భాషల్లోనూ అంతే ఎనర్జిటిక్ హీరోల్ని దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకుంటున్నారు. ఆర్ ఎక్స్ 100 హిందీ రైట్స్ ని 1.5కోట్లకు సాజిద్ నదియద్ వాలా కొనుక్కున్నారు.. కన్నడలో డిఎస్.రావ్ రీమేక్ చేస్తున్నారు. తాజా సమచారం ప్రకారం.. హిందీ వెర్షన్ కి హీరోని ఫైనల్ చేశారని తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి ఈ చిత్రంతో హీరోగా బాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు. అహన్ ఇప్పటికే నటశిక్షణతో పాటు - డ్యాన్సులు - ఫైట్స్ లోనూ శిక్షణ తీసుకున్నాడు. గత కొంతకాలంగా సాజిద్ తో ప్రాజెక్టు గురించి మంతనాలు సాగుతున్నాయి. ఆ క్రమంలోనే ఆర్.ఎక్స్ 100 రీమేక్ రైట్స్ తీసుకుని మిలన్ లుథ్రియా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో వివరాలందించారు. ఇతర కాస్టింగ్ సహా క్రూ వివరాలు తెలియాల్సి ఉంది.