Begin typing your search above and press return to search.
అహింస : తేజ మార్కు యాక్షన్ డ్రామా!
By: Tupaki Desk | 9 Sep 2022 5:30 AM GMTదగ్గుబాటి రానాతో రూపొందించిన 'నేనే రాజు నేనే మంత్రి' మూవీతో దర్శకుడు తేజమళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. అయితే ఆ తరువాత చేసిన 'సీత' డిజాస్టర్ గా నిలిచి తేజ కెరీర్ ని ప్రశ్నార్థకంలో పడేసింది. దీంతో దాదాపు రెండున్నరేళ్ల విరామం తరువాత 'అహింస' అంటూ తనదైన మార్కు యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ద్వారా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు తనయుడు, హీరో రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నారు.
ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్ టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. తాజాగా శుక్రవారం ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. ముఖానికి జనపనార సంచిని కవర్ చేస్తూ కట్టడంతో అభిరామ్ ముఖం కనిపించడం లేదు. అలా కవర్ చేసిన వుండగా ఓ గ్రూప్ వెంటపడుతుంటే పారిపోతుండటం.. తిరిగి ఆ గ్రూప్ అతన్ని పట్టుకుని హింసించడం గ్లింప్స్ లో కనిపిస్తోంది. చూట్టూ నరమానవుడు ఎవరూ కనిపించని అటవీ ప్రాంతంలో అభిరామ్ ని ఓ గ్యాంగ్ హింసించడం కనిపిస్తోంది.
పేరులో అహింస అని కనిపిస్తున్నా సినిమాలో మాత్రం హింస ప్రధానంగా సాగేలా కనిపిస్తోంది. తేజ మార్కు యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ వుంటుందని గ్లింప్స్ లో సన్నివేశాలను బట్టి అర్థమవుతోంది. గతంలో ప్రేమకథా చిత్రాలతో యూత్ ని విశేషంగా ఆకట్టుకున్న తేజ చాలా రోజుల తరువాత మళ్లీ తన టీమ్ తో కొత్త పంథాలో చేస్తున్న సినిమా ఇది.
గీతిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఆనందీ ఆర్ట్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. చాలా కాలం తరువాత తేజ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, కోటిగిరి వెంటకేశ్వరరావు ఎడిటింగ్, అనిల్ అచ్చుగట్ల మాటలు అందిస్తున్న ఈ మూవీలో రజత్ బేడీ, సదా, రవికాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరలు నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.