Begin typing your search above and press return to search.
దగ్గుబాటి వారబ్బాయిలో అది మిస్సయిందే?
By: Tupaki Desk | 16 Sep 2022 10:27 AM GMTదర్శకుడిగా ఎంతో మంది కొత్త వాళ్లని స్టార్స్ గా మార్చిన ఘనత దర్శకుడు తేజ సొంతం. ఉదయ్ కిరణ్ నుంచి నితిన్, గోపీచంద్ ల వరకు ఇలా ఎంతో మందిని తేజ స్టార్స్ ని చేశారు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు తనయుడు, హీరో రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ ని తేజ హీరోగా పరిచయం చేస్తూ 'అహింస' పేరుతో ఓ మూవీని రూపొందిస్తున్నారు.
ఆనందీ ఆర్ట్స్ అధినేత పి. కిరణ్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తేజ్ రూపొందించిన 'సీత' డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తరువాత కొంత విరామం తీసుకున్న తేజ దగ్గుబాటి వారసుడిని హీరోగా పరిచయం చేస్తూ 'అహింస' మూవీని రూపొందిస్తున్నారు.
ఇటీవలే ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. అభిరామ్ ముఖానికి జనపనార సంచిని కవర్ చేసికట్టి ఓ గ్రూప్ అతన్ని కొండల మధ్య లాక్కుంటూ వెళుతుంటే నోటి నుంచి బ్లాడ్ కారుతున్న దృశ్యాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
నటీనటుల వేషధారణ కొంత విచిత్రంగా కనిపిస్తోంది. ఇదిలా వుంటే ఈ శుక్రవారం ఈ మూవీలోని ప్రధాన పాత్రలని పరిచయం చేస్తూ వారి వాయిస్ డైలాడ్ లతో పోస్టర్స్ ని విడుదల చేశారు. సినిమాలో అభిరామ్ ఇన్నోసెంట్ అయిన యువకుడు రఘు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబందించిన వాయిస్ లో దగ్గుబాటి వారి బేస్ తగ్గినట్టుగా కనిపిస్తోంది.
రామానాయుడు గారి నుంచి రానా వరకు ప్రతీ ఒక్కరిదీ బేస్ వాయిస్.. కానీ అభిరామ్ వాయిస్ లో మాత్రం అది మిస్సయినట్టుగా కనిపిస్తోంది. క్యారెక్టర్ సాఫ్ట్ గా వుందని అలా వాయిస్ టోన్ డౌన్ చేశారా అన్నది సినిమా చూస్తే కానీ అర్థం కాదు.
గీతిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఆనందీ ఆర్ట్స్ బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. చాలా కాలం తరువాత తేజ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, కోటిగిరి వెంటకేశ్వరరావు ఎడిటింగ్, అనిల్ అచ్చుగట్ల మాటలు అందిస్తున్న ఈ మూవీలో రజత్ బేడీ, సదా, రవికాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరలు నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.