Begin typing your search above and press return to search.
'మహర్షి'కి మరో బ్రేక్..మహేష్ ని ఆడుకున్న సిబ్బంది...!
By: Tupaki Desk | 25 Feb 2019 4:19 AM GMTప్రిన్స్ మహేష్ బాబు! టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ హీరోల్లో ఒకరు...అయితే ఆయన నటిస్తున్న మహర్షి సినిమా విషయంలో మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే అదిగో....ఇదిగో అంటూ ఈ సినిమా ఎప్పటి నుంచో కాస్త వాయిదా పడుతూనే వస్తుంది. ఇక ఈ వాయిదాలకు తోడు ఇప్పుడు ఈ సినిమాకు మరో బ్రేక్ పడింది...ఇంకో చిక్కు ఎదురయ్యింది...అదేంటి అంటే...ప్రిన్స్ మహేష్ నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ యధావిధిగా సాగుతున్న క్రమంలో ఈ సినిమా షూటింగ్ కోసం మహేష్ నిన్న మేక్ అప్ వేసుకుని ఎయిర్ పోర్ట్ కి చేరుకోగా... ఎయిర్ పోర్ట్ సిబ్బంది మహేష్ ను ఆపేశారని సమాచారం..
తాను షూటింగ్ కి వెళ్ళాలి అని...టైమ్ అయిపోతుంది అని ఎంత వారించినా...ఒప్పుకోలేదు సిబ్బంది. అసలు ఆపడానికి కారణం ఏంటి అంటే, పుల్వామా అట్యాక్ తర్వాత మన సైనికులు ఇచ్చిన సమాధానానికి ప్రతిగా అనేక చోట్ల ఫ్లైట్స్ ను హైజాక్ చెయ్యాలి అని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లుగా వార్తలు వచ్చిన తరుణంలో భద్రతా అధికారులు అలెర్ట్ అయ్యారు. డిల్లీ నుంచి ఆదేశాలు ఇవ్వకుండా విమాన రాకపోకలను సాగించవద్దు అంటూ తేల్చి చెప్పేశారు. అయితే ఈ కారణం చేతనే మహేష్ ను ఆపేశారట మన ఎయిర్ పోర్ట్ అధికారులు...
ఇక అన్ని అనుమతులూ ఉన్నాయి అని ప్రిన్స్ అండ్ టీమ్ తెలిపినా ఒప్పుకోలేదట అధికార వర్గాలు...ఇక చేసేది ఏమీ లేక పార్కింగ్ లో తన కార్ లోకి వెళ్ళి కూర్చున్నాడట మహేష్..అయితే దాదాపుగా 5 గంటల పాటు అధికారులు అనుమతిని ఇస్తారేమో అని వేచి చూసిన మహేష్ చివరకు అధికారుల నుంచి ఏ సమాచారం లేకపోవడంతో చేసేది ఏమీ లేక షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడట. ఇక ఈ వార్త తెలియగానే..భద్రతా దృష్ట్యా అలా చెయ్యడం కరెక్ట్ అయినప్పటికీ...ఇప్పటికే లేట్ అయిన మహర్షి సినిమా ఇలాంటి కారణాల రీత్యా మరింత లేట్ అయిపోతుంది అని పాపం ప్రిన్స్ ఫాన్స్ ఆవేదన చెందుతున్నారట.