Begin typing your search above and press return to search.

ఇన్నేళ్ల తర్వాత ఐష్ మళ్లీ ప్రెగ్నెంట్? సోషల్ మీడియా రియాక్షన్!

By:  Tupaki Desk   |   21 July 2022 7:30 AM GMT
ఇన్నేళ్ల తర్వాత ఐష్ మళ్లీ ప్రెగ్నెంట్? సోషల్ మీడియా రియాక్షన్!
X
సామాన్యులకు.. సెలబ్రిటీలకు ఉన్న తేడా తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత జీవితాల మీద ఉండే ఆసక్తి.. వారికి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవాలన్న ఉత్సుకత చాలా ఎక్కువన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ ఆసక్తి మరింత పెరిగింది. దీనికి కారణం రెండువైపులా ఉందనే చెప్పాలి. సెలబ్రిటీలు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ ఇమేజ్ ను పెంచుకోవటానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. వ్యూహాత్మకంగా ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటున్నారు.

పేరుకు పేరుతో పాటు.. సెలబ్రిటీ స్టేటస్.. వీటన్నింటితో పాటు ఆదాయం. అయితే.. తమకు సంబంధించిన విషయాల్ని తాము మాత్రమే చెప్పాలే కానీ..మరెవరైనా చెప్పినా వారు కస్సు మంటున్నారు.

అంతేనా.. ఇష్టారాజ్యంగా గ్లామర్ ఆరబోస్తూ ఫోటోల్ని విచ్చలవిడిగా షేర్ చేసే ప్రముఖుల తీరుతో కొందరు అతిగాళ్లు తమ అతిని ప్రదర్శిస్తే.. దానికి క్లాసులు పీకటం లాంటి వాటితో నిత్యం సోషల్ మీడియా మూడు పొగడ్తలు.. ఆరు తిట్లు అన్న చందంగా మహా డైనమిక్ గా ఉంటున్న పరిస్థితి.

ఇదంతా ఎందుకంటే.. ఒకప్పటి ప్రపంచ సుందరి.. ఇప్పటికి అందంలో.. ఐశ్వర్యంలో ఏ మాత్రం తీసిపోని ఐశ్వర్యారాయ్ మరోసారి ప్రెగ్నెంట్ అయ్యిందన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలోనూ ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు వార్తలు వచ్చినా.. అవన్నీ ఉత్త ప్రచారమే అన్న విషయం స్పష్టమైంది. అయితే.. ఈసారి మాత్రం ఐష్ తల్లైందన్న మాట బలంగా వినిపిస్తోంది.

దీనికి సాక్ష్యంగా.. ఇటీవల ఎయిర్ పోర్టులో కనిపించిన ఐష్ ను చూసినప్పుడు.. ఆమె పొట్ట భాగం కాస్త ముందుకు వచ్చిన వైనం చూపించటమే కాదు..కాస్తంగా బొద్దుగా మారిన ఐష్ ను చూపిస్తూ ఈసారి ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందని తేల్చేస్తున్నారు.

దీనికి తోడు ఆమె ఉదర భాగాన్ని కాస్త కవర్ చేసినట్లుగా కనిపిస్తుండటంతో ఆమె ప్రెగ్నెంట్ అయ్యారన్న వార్తపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ వైరల్ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి ఖండన రాకపోవటంతో.. ఇన్నేళ్ల తర్వాత మరోసారి ప్రెగ్నెంట్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. 2007లో ఐష్.. అభిషేక్ బచ్చన్ లకు పెళ్లి కాగా.. 2011లో ఆరాధ్య వారికి మొదట సంతానమన్న సంగతి తెలిసిందే.

దాదాపు పదకొండేళ్ల తర్వాత ఐష్ మళ్లీ తల్లైందన్న మాట వినిపిస్తోంది. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో కాస్త భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఐష్ ప్రెగ్నెంట్ అయితే ఎందుకు వార్త అవుతుందని కొందరు.. ఆమె ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందన్న మాట వినిపిస్తోంది. ఇంకోవైపు.. బచ్చన్ అభిమానులు మాత్రం.. మరో బుల్లి వారసురాలు వస్తున్నారన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.