Begin typing your search above and press return to search.

ధనుష్ ట్వీట్‌ కి ఐష్‌ రీట్వీట్‌.. అసలేం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   18 March 2022 9:31 AM GMT
ధనుష్ ట్వీట్‌ కి ఐష్‌ రీట్వీట్‌.. అసలేం జరుగుతోంది?
X
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవలే భర్త ధనుష్‌ నుంచి విడిపోతున్నట్లుగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెల్సిందే. ధనుష్ తో విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించిన ఐశ్వర్య రజినీకాంత్ ఇంకా తన ట్విట్టర్ ఖాతాకు ధనుష్‌ పేరును తొలగించ లేదు. దాంతో అనేక అనుమానాలు మరియు ఊహాగాణాలు కొనసాగుతున్నాయి.

ఇద్దరికి అధికారికంగా విడాకులు రాలేదేమో అందుకే ఆమె పేరు నుండి ధనుష్ ను తొలగించలేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఐశ్వర్య నుండి ఎలాంటి ఇబ్బంది లేదు.. ఆమె కలిసి ఉండాలని భావిస్తుంది కానీ ధనుష్ మాత్రమే ఈ సమయంలో ఆమెను దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది వారిద్దరికీ తెలుసు.

తాజాగా ఐశ్వర్య రజినీకాంత్ 'పయని' అనే మ్యూజిక్ ఆల్బమ్ ను చేసింది. జానీ మాస్టర్ ఆధ్వర్యం లో ఆ మ్యూజిక్ ఆల్బం రూపొందింది. ఐశ్వర్య దర్శకత్వం లో వచ్చిన ఆ మ్యూజిక్ ఆల్బమ్ ను టాలీవుడ్ మరియు కోలీవుడ్ కు సంబంధించిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.

అదే వీడియోని ధనుష్ కూడా షేర్ చేయడంతో అందరికీ చెప్పినట్లుగానే ధనుష్ కి కూడా ఐశ్వర్య కృతజ్ఞతలు చెప్పింది. అయితే ధనుష్ ఆ వీడియోని షేర్ చేస్తున్న సమయంలో స్నేహితురాలు అంటూ పేర్కొనడం జరిగింది. ఐశ్వర్య ఇంకా తన ట్విట్టర్ ఖాతా నుండి ధనుష్‌ పేరును తొలగించ లేదు. కానీ ఆయన మాత్రం స్నేహితురాలు అంటూ ట్వీట్ చేయడం కొందరు అభిమానులకు నచ్చడం లేదు.

ధనుష్ ను ఈ సమయంలో చాలా మంది అభిమానులు తీవ్రంగా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఐశ్వర్య ధనుష్‌ కావాలని తన పేరులో ధనుష్ ను తొలగించలేదు. కాని ఆయన మాత్రం ఆమెను ఒక స్నేహితురాలి గా చూస్తున్నట్లుగా ఫ్రెండ్ అని పెట్టడం ఫ్యాన్స్ కి కాస్త ఇబ్బందికరంగా ఉంది అంటూ వారు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

ధనుష్ చేసిన ట్వీట్ కి ఐశ్వర్య థాంక్యూ అంటూ రెస్పాండ్ అయింది. అదే సమయంలో గాడ్ స్పీడ్ అంటూ ఐశ్వర్య చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.