Begin typing your search above and press return to search.

బాలీవుడ్ భామలకు టాలీవుడ్ భయం

By:  Tupaki Desk   |   24 Dec 2015 9:30 AM GMT
బాలీవుడ్ భామలకు టాలీవుడ్ భయం
X
ముంబై నుంచి భామలను దిగుమతి చేసుకోవడం మనకు కొత్తేం కాదు. ఫ్రెష్ పెయిర్ - కొత్త కాంబినేషన్ అంటూ పక్క భాషల హీరోయిన్ల మీదే ఎక్కువగా కనేస్తారు మన వాళ్లు. ఈ ట్రెండ్ బాగానే ఉందని అనుకుంటున్న టైంలో.. కొందరు భామలు షాక్ ఇవ్వడం మొదలుపెట్టారు.

ఐషా శర్మ - అమైరా దస్తూర్ లు.. టాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తర్వాత ఆ ప్రాజెక్టులకు నో చెప్పేశారు. దీనికి కారణం ముంబై కాస్టింగ్ ఏజన్సీలని తెలుస్తోంది. మన దగ్గర కాస్టింగ్ ఏజన్సీలతో పెద్దగా పని ఉండదు. ఫలానా వాళ్లు కావాలని హీరో - డైరెక్టర్ ఫిక్స్ అవగానే.. హీరోయిన్ మేనేజర్ కాల్ చేసి డైరెక్ట్ గా అప్రోచ్ అయిపోతారు. షెడ్యూల్స్ - డేట్స్ - ఫెసిలిటీస్ లాంటి వన్నీ కూడా నేరుగానే మాట్లాడేసుకుంటారు. కానీ బాలీవుడ్ లో అలా కుదరదు.. 90శాతం కాంబినేషన్లు కుదిర్చేది కాస్టింగ్ ఏజన్సీలే.

వీళ్లే ఈ ముంబై భామలను సౌత్ అంటే భయపెట్టారట. సౌత్ లో సెట్ అయితే.. నార్త్ లో నిలదొక్కుకోవడం కష్టమని చెప్పారట. త్రిష - ఇలియానా - తమన్నా - కాజల్ లాంటి వాళ్లందరూ అక్కడి భామలే అయినా.. ఇప్పుడు దక్షిణాదికే పరిమితం అయ్యారనే విషయాన్ని గుర్తు చేశారట. దీంతో టాలీవుడ్ ఎంట్రీపై తమ నిర్ణయాన్ని మార్చుకుని హ్యాండ్ ఇచ్చేశారు ఐషాశర్మ - అమైరా దస్తూర్. అయినా.. ఎక్కువ కాలం చేసి, సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేవాళ్లకి ఏదన్నా ప్రాబ్లెం వస్తుందేమో కానీ.. ఒకటీ అరా మెరుపులతో సరిపెట్టుకునేవాళ్లకి ఈ సమస్య రాదనే విషయాన్ని గుర్తించడం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో ఇప్పటి టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా తెలుగు సినిమాలు చేసిన విషయాన్ని వీళ్లు మర్చిపోయినట్లున్నారు కదూ.