Begin typing your search above and press return to search.

అందుకా అమ్మడు జండా ఎత్తేసింది

By:  Tupaki Desk   |   30 Dec 2015 3:46 AM GMT
అందుకా అమ్మడు జండా ఎత్తేసింది
X
అప్పట్లో శివం సినిమా.. మొన్నేమో రోగ్‌.. రెండింటినీ ఒకే టైపులో ట్రీట్‌ చేసింది ముంబయ్‌ మోడల్‌ అయేషా శర్మ. అమ్మడు చిరుత ఫేం హీరోయిన్‌ నేహా శర్మ సిస్టర్‌ అనే సంగతి తెలిసిందే. కట్‌ చేస్తే.. ఈ బంగారం వారం రోజులు షూటింగ్‌ చేసిన తరువాత రెండు సినిమాల నుండి జెండా ఎత్తేసి ముంబయ్‌ లోనే తేలింది మళ్లీ. ఐతే ఎందుకిలా చేసిందంటారు?

నిజానికి అమ్మడు ముంబయ్‌లో ఇప్పుడు కింగ్‌ ఫిషర్‌ క్యాలెండర్‌ లో తళుక్కుమంటోంది. 2016 కింగ్ ఫిషర్‌ క్యాలెండర్‌ లో మూడు పేజీల్లో బికినీల్లో తన అందాన్ని ఆరబోసింది అయేషా శర్మ. ఆ రేంజులో గతంలో దీపికా పదుకొనె - కత్రినా కైఫ్‌ వంటి భామలు కూడా ఆరబోశారు. అలా ఆరబోస్తే ఇంకేముంది.. చక్కగా బాలీవుడ్‌ లోనే ఆఫర్లు వస్తాయి. ఒకవేళ అక్కయ్య నేహా శర్మ లా తెలుగులో డెబ్యూ చేసి.. తరువాత బాలీవుడ్‌ లో ఛాన్సుల కోసం స్ర్టగుల్‌ అయ్యేబదులు.. హ్యాపీగా క్యాలెండర్‌ లో మెరిసి చక్కగా బాలీవుడ్‌ స్టార్‌ అయిపోతే బెటర్‌ అనుకుందేమో. అందుకేనా ఇక్కడి నుండి జెండా ఎత్తేసింది?