Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మేకప్ లేని బికినీ బ్యూటీ

By:  Tupaki Desk   |   25 Sept 2018 10:10 AM IST
ఫోటో స్టొరీ: మేకప్ లేని బికినీ బ్యూటీ
X
మనుషులు తప్ప మేకప్ ఎవరైనా వేసుకుంటారా? ఎవ్వరూ వేసుకోరు. వాటికి మేకప్ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ అవసరం లేదు. సోషల్ మీడియా తో అసలు పని లేదు. మనుషులకు అలా కుదరదు. ముఖ్యంగా అమ్మాయలకు మరీ కుదరదు. అందులోనూ అందమైన భామలకు ఇంకా కుదరదు. కుదరదంటే కుదరదంతే!

కానీ ఈ జూనియర్ చిరుతమాత్రం మేకప్పే లేకుండా ఒక ఫోటో దిగి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. జూనియర్ చిరుత ఎవరని మీరు టెన్షన్ పడొద్దు. రామ్ చరణ్ 'చిరుత' సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహ శర్మ చెల్లి ఈ ఐషా. బ్లాక్ కలర్ బికినిలో ఒక పూల్ పక్కన చెట్టులాంటి స్థంభానికి కు అనుకుని అలా ఖజురహో శిల్పంలా నిలబడింది. వెనక పచ్చని మొక్కలు చెట్లు అన్నీ చూస్తుంటే ప్రకృతితో మమేకమైపోయినట్టుగా ఉంది. చెట్టులాంటి పిల్లర్ కు ఈ ఐషా పిల్ల స్కిన్ టోన్ కు కరెక్ట్ గా మ్యాచ్ అయింది. లైటింగ్ తక్కువగా ఉండడంతో చాకోలేట్ సుందరిలా కనిపించింది.

ఇక ఈ ఫోటోకు ఐష 'పూల్ డేస్ ఆర్ ది బెస్ట్ డేస్' అని క్యాప్షన్ పెట్టింది. మంచి క్యాప్షనే.. ఆమెకి పూల్ డేస్ బెస్ట్ అయితే నెటిజనులకు ఇలాంటి బికినీ ఫొటోలు షేర్ చేసిన డేస్ బెస్ట్ డేస్. అందుకే బికినీలో ఆమె అందాన్ని సెక్సీనెస్ ను వర్ణిస్తూ ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ రెచ్చిపోయారు.