Begin typing your search above and press return to search.

డిఫ‌రెంట్ ఫోటోగ్ర‌ఫీతో మెంటలెక్కిస్తోంది!

By:  Tupaki Desk   |   12 Dec 2021 10:32 AM GMT
డిఫ‌రెంట్ ఫోటోగ్ర‌ఫీతో మెంటలెక్కిస్తోంది!
X
వైవిధ్యం విల‌క్ష‌ణ‌త అంటే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంది శ‌ర్మా గాళ్ ఐషా శ‌ర్మ‌. సోద‌రి నేహా శ‌ర్మ‌తో పోలిస్తే త‌న‌ని తాను యూనిక్ గా ప్రెజెంట్ చేసుకునేందుకు ప్ర‌తిసారీ ప్ర‌య‌త్నిస్తోంది ఈ బ్యూటీ. శ‌ర్మాగాళ్స్ నిరంత‌ర ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

ఐషా అథ్లెట్ కం మోడ‌ల్. న‌టిగా ఇప్పుడిప్పుడే రాణిస్తోంది. ఇటీవ‌లే జాన్ అబ్ర‌హాం స‌త్య‌మేవ జ‌య‌తే చిత్రంలో న‌టించింది. త‌దుప‌రి బిగ్ బ్యాన‌ర్స్ చిత్రాల‌కు సంత‌కాలు చేసేందుకు వెయిటింగ్ లో ఉంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే త‌న‌కు సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డ‌డంతో అది కాస్తా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఆదాయంగా స‌హ‌క‌రిస్తోంది. ప్ర‌స్తుతానికి సినిమాల‌తో కంటే ప్ర‌క‌ట‌న‌ల‌తోనే బాగా ఆర్జిస్తోంది ఈ బ్యూటీ. మునుముందు స్టార్ గా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

శ‌ర్మా గాళ్స్ బీహార్ -భ‌గ‌ల్ పూర్ కి చెందిన ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడి కుమార్తెలు అన్న సంగ‌తి తెలిసిందే. మోడ‌లింగ్ న‌ట‌నా రంగంపై మ‌క్కువ‌తో ముంబై ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించారు. అక్క‌డ కెరీర్ కోసం చాలా కాలంగా త‌పిస్తూనే ఉన్నారు ఈ అంద‌గ‌త్తెలు. కానీ ఏదీ అంత ఈజీగా అంద‌లేదు.

ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు రావాలంటే చాలా కోణాల్లో నిరూపించుకోవాలి. స్టార్ అవ్వాలంటే ఇంకా చాలా కావాలి. చ‌క్క‌ని న‌ట‌నాభిన‌యం అంత‌కుమించి ఇంకేదైనా గ‌మ్మ‌త్త‌యిన ప‌నిత‌నం కావాలి. దానికి మించి ల‌క్ కూడా క‌లిసి రావాలి. ఇన్ని ఉంటేనే ఈరోజుల్లో ఇంత పోటీలో దూసుకెళ్ల‌గ‌ల‌రు. ఇప్ప‌టికైనా శ‌ర్మా సిస్ట‌ర్స్ ప్ర‌తిదీ ప‌క్కాగా ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతున్నార‌నే ఆశిస్తున్నారు బిహారీ ఫ్యాన్స్. తాజాగా ఐషా శ‌ర్మ షేర్ చేసిన ఓ హాటెస్ట్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. వెరైటీ భంగిమ‌తో ఐషా ఫ్యాన్స్ క‌ళ్ల‌ను త‌న‌వైపు తిప్పేసుకుంది.