Begin typing your search above and press return to search.

బ‌ట‌న్ లెస్ ఫోజుల‌తో మెంట‌లెక్కించిన శ‌ర్మా గాళ్

By:  Tupaki Desk   |   19 Aug 2021 3:30 PM GMT
బ‌ట‌న్ లెస్ ఫోజుల‌తో మెంట‌లెక్కించిన శ‌ర్మా గాళ్
X
సోషల్ మీడియా క్వీన్ ఐషా శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఫ్యాషనిష్టాగా అథ్లెట్ గా యువ‌త‌రానికి సుప‌రిచితం. ఇటీవ‌ల త‌న సోద‌రి నేహా శ‌ర్మ‌తో ఐషా శ‌ర్మ యూనిక్ నెస్ తో కూడుకున్న‌ ఆకర్షణీయమైన ఫోటోషూట్ ల‌ను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారారు.

ఐషా స్పీడ్ కి త‌గ్గ‌ట్టే సోష‌ల్ మీడియాల ద్వారా భారీ ఆదాయం ఆర్జిస్తోంది. ఇక ఈ అమ్మ‌డికి డిజిట‌ల్ వేదిక‌ల‌పై భారీ ఫాలోవ‌ర్స్ క‌లిగి ఉండ‌డం ఆర్జ‌న‌కు పెద్ద ప్ల‌స్ గా మారింది. ఇటీవ‌లే ప్ర‌ఖ్యాత ఏఎల్ ఓ లోదుస్తుల బ్రాండ్ కి ప్ర‌మోట‌ర్ గా భారీ డీల్ కుదుర్చుకున్న ఈ బ్యూటీ త‌న సోద‌రి నేహాతో క‌లిసి ప‌లు కోలా బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తోంది.

ఇక ఐషా శ‌ర్మ ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. జిమ్నాస్టిక్ లుక్.. బికినీలుక్ స్విమ్ సూట్ల‌కు కొద‌వేమీ లేదు. తాజాగా ఐషా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఈ హాట్ గాళ్ నేవీ బ్లూ షైనీ డిజైన‌ర్ డ్రెస్ లో క‌నిపించింది. ష‌ర్ట్ బ‌ట‌న్ లెస్ ఫోజుతో కుర్ర‌కారు కంటికి కునుకు ప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చింది. ఈ లుక్ పై యూత్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ``ఇంత వేడిగా క‌నిపిస్తావ్ అదే స‌మ‌యంలో క్యూట్ గా అనిపిస్తావ్!`` అంటూ ఈ ఫోటోగ్రాఫ్ చూడ‌గానే త‌న సోద‌రి నేహా శ‌ర్మ కాంప్లిమెంట్ ఇచ్చింది.

ఐషాశ‌ర్మ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఇంత‌కుముందు జాన్ అబ్ర‌హాం స‌త్య‌మేవ జ‌య‌తే చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం బెల్ బాటమ్- గంగూబాయి కతియావాడి లాంటి క్రేజీ చిత్రాల్లో ఐషా శ‌ర్మ క‌నిపిస్తోంది. ఐషా శ‌ర్మ అక్క నేహా శ‌ర్మ‌ను మించి క్రేజీ నాయిక‌గా వెలిగిపోతోంది. త‌దుప‌రి టాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఉంద‌ని స‌మాచారం. ఐషా ఫ్యామిలీ మ్యాట‌ర్ కి వ‌స్తే .. ఈ బ్యూటీ చిరుత ఫేం నేహా శ‌ర్మ సోద‌రి. రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి రంగుల ప్ర‌పంచంలోకి వ‌చ్చి స‌త్తా చాటుతున్నారు.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూ సెష‌న్ లో ఐషా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు స‌హా వృత్తి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. తాను ఒక‌ మోడల్.. ఇంజనీర్ అయినా న‌ట‌న‌ను ఎంచుకోవ‌డానికి కార‌ణం ఈ రంగం అంటే ప్యాష‌న్ అని తెలిపింది.

నేను బయోటెక్నాలజీ ఇంజనీర్ ని. నేహా NIFT ఫ్యాషన్ డిజైనర్ అని చాలా మందికి తెలియదు. నాన్న అజిత్ శర్మ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. కానీ నేను బీహార్ నుండి ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువ‌తిని. మా అమ్మ ఒక విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ముందుగా విద్య. మేము ఆ డిగ్రీ పొందిన తర్వాత చేయాలనుకున్నది ఏదైనా చేయమని చెప్పింది. నా కుటుంబంలో ఎవరూ సినిమా వ్యాపారంలో లేరు. కానీ నేహా నేను ఆ కలని అనుసరించాము. నా కుటుంబంలో ఎవ్వరూ చదువు కోసం విదేశాలకు వెళ్లలేదు. కానీ నా ఇద్దరు తోబుట్టువులు చదువుకున్నారు. మేము మా స్వంత మార్గాలను అనుస‌రిస్తున్నాం.. అని తెలిపింది.

మోడల్స్ కు ఎల్లప్పుడూ టైప్ కాస్ట్ అనే భయం ఉంటుంది. మీ మొదటి సినిమా గురించి మీకు ఏమైనా ఆందోళనలు ఉన్నాయా? అన్న ప్ర‌శ్న‌కు ఐషా స్పందించింది. మోడల్ గా ఉన్నప్పుడు ఫ‌లానా స్లాట్ అనే ఎంపిక‌లు ఉండ‌వు... కాబ‌ట్టి ఆకర్షణీయమైన అవ‌కాశాలను పొందుతారని భావిస్తున్నారు. నా మొదటి సినిమా నుండి నాకు ఉన్న ఏకైక నిరీక్షణ ఏమిటంటే నేను నటించగలనని కథలో నేను భాగం అని ప్ర‌జ‌లు చెబుతారా లేదా? అనేదే నా వేద‌న‌. కానీ అనుకున్న‌ది సాధించాను. ఆసక్తికరంగా ఇటీవల వచ్చిన `తేరే జైసా..` పాటను మినహాయించి సత్యమేవ జయతేలో నా పాత్ర గ్లామర్ గా లేదు. నాకు మొదట `నమస్తే ఇంగ్లాండ్`లో ఆఫర్ ద‌క్కింది. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేదు. అక్షయ్ సర్ (కుమార్) మొదట్లో ఆ సినిమాలో భాగం కావాల్సి ఉండ‌గా ఆయ‌నా చేయ‌లేదు.. అని తెలిపింది.