Begin typing your search above and press return to search.

పొన్నియిన్ సెల్వన్ నందినిగా ఐశ్వర్య అందం

By:  Tupaki Desk   |   25 Aug 2022 10:41 AM GMT
పొన్నియిన్ సెల్వన్ నందినిగా ఐశ్వర్య అందం
X
తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పొన్నియిన్ సెల్వన్ విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 30వ తారీకు పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.

సినిమా లో పలువురు స్టార్స్ ఉన్నా కూడా ఐశ్వర్య రాయ్ పాత్ర పైనే ఎక్కువ శాతం మంది దృష్టి ఉంది. చాలా సంవత్సరాల తర్వాత సౌత్‌ లో ఐశ్వర్య రాయ్ సినిమా ను చేయడం తో ఆమె అభిమానులు మరియు సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐశ్వర్య రాయ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లయినా.. పెళ్లి చేసుకున్నా.. బిడ్డకు తల్లి అయినా కూడా ఆమెను మాత్రం అభిమానిస్తూనే ఉన్నారు.

తాజాగా ఐశ్వర్య రాయ్ ఇన్ స్టా గ్రామ్‌ లో తన పొన్నియిన్ సెల్వన్ నందిని లుక్‌ ను రివీల్‌ చేసింది. ఇంతకు ముందే ఐశ్వర్య రాయ్ పోస్టర్స్ వచ్చాయి కానీ ఈసారి ఐశ్వర్య రాయ్ రిలీజ్ చేసిన స్టిల్‌ చాలా యూనిక్ గా ఉండటం మాత్రమే కాకుండా ఐశ్వర్య రాయ్‌ ని పదేళ్లు వెనక్కు తీసుకు వెళ్లినట్లుగా ఉందంటూ తక్కువ వయసు లో చూపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఐశ్వర్య రాయ్ సిల్క్‌ సారీ లో చాలా బంగారు ఆభరణాల్లో రాణి గారి పాత్రకు సరిగా సూట్‌ అయినట్లుగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్‌ సినిమా లో ఐశ్వర్య రాయ్ నందిని పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయం అంటూ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. నందిని గా ఐశ్వర్య అందం ను మీరు ఒక లుక్కేయండి.