Begin typing your search above and press return to search.

ఆవిడకు సినిమా నచ్చినట్లు లేదు

By:  Tupaki Desk   |   19 Aug 2017 12:30 AM GMT
ఆవిడకు సినిమా నచ్చినట్లు లేదు
X
అసలు ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ టైమ్ లైన్లో మనం పోస్టుచేసే వాటిని చూసి కొన్ని కార్పొరేట్ కంపెనీలు మనం ఏం చెబుతున్నామో మన మనస్తత్వం ఎలాంటిదో మనం ఎలాంటి పనులను ఎలా చేయడానికి ఇష్టపడతామో చెప్పేస్తారట. అదంతా నిజమేనా అని చాలామంది అనుకోవచ్చు కాని.. సెలబ్రిటీల టైమ్ లైన్ చూస్తే మాత్రం కొన్ని విషయాలను ఇట్టే చెప్పేయవచ్చు.

ఫర్ ఎగ్జాంపుల్ మనం రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ను తీసుకుందాం. ఈమె ఓ రెండు నెలల క్రితం వరకు తన మొగుడు ధనుష్‌ కథ రచించి తన చెల్లెలు సౌందర్య డైరక్షన్ లో చేస్తున్న 'విఐపి 2' గురించి తెగ చెప్పింది. కాని సినిమా రిలీజ్ గురించి కాని.. రిలీజ్ అయ్యాక వచ్చిన రివ్యూల గురించి కాని.. అసలు ఏ విధంగానూ సినిమాను ప్రమోటే చేయలేదు. తన ట్విట్టర్ లో కాని ఇంకెక్కడైనా కూడా అసలు చర్చించలేదు కూడా. దీన్నిబట్టి ఏం అర్ధం చేసుకోవచ్చు అని అడిగితే.. ఆమెకు విఐపి 2 సినిమా ముందే చూసినప్పుడు అస్సలు నచ్చి ఉండదని అందుకే ఈ సినిమా గురించి చెప్పట్లేదని అంటున్నారు సోషల్ మీడియా జనాలు.

ఇప్పుడు ఇలాంటి డిస్కషన్లు రావడం కారణగా.. ధనుష్‌ అండ్ ఐశ్వర్య మధ్యన కూడా రిలేషన్ సరిగ్గా లేదంటూ రూమర్లు వస్తున్నాయి. కాకపోతే ప్రస్తుతం ధనుష్‌ తన మావగారి కొత్త సినిమాను ప్రొడ్యూస్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. పా రంజిత్ డైరక్షన్లో 'కాలా' సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు ధనుష్‌. అది సంగతి.