Begin typing your search above and press return to search.

ఐష్‌ ఎందుకు యాక్టింగ్ చేయలేదంటే

By:  Tupaki Desk   |   21 Dec 2016 11:30 AM GMT
ఐష్‌ ఎందుకు యాక్టింగ్ చేయలేదంటే
X
రజినీకాంత్ కూతురుగా ఐశ్వర్యా ధనుష్ కు ఎంతో ఫాలోయింగ్ ఉంది. అటు భర్త ధనుష్ సినిమాలకు సంబంధించిన పనులు చూసుకోవడంతో పాటు.. ఇటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ఐశ్వర్య పలు ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పింది. దగ్గుబాటి రానా సహా పలువురు ఈ తరం యాక్టర్లు, టెక్నీషియన్స్ పాల్గొన్నా.. ఈ కార్యక్రమంలో మెయిన్ ఎట్రాక్షన్ ఐశ్వర్యే.

మీరు ఎందుకు నటి కాలేదు అనే ప్రశ్నకు ఐశ్వర్య నుంచి వచ్చిన ఆన్సర్ అందరినీ ఆకట్టుకుంది. 'ఎప్పుడూ స్మార్ట్ గా అందంగా మంచిగా కనిపించాల్సి వస్తుందనే ఆలోచనే నన్ను నటన వైపు అడుగులు వేయకుండ చేసింది. అది చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం' అని చెప్పిన ఐశ్వర్య అక్కడితో ఆగకుండా తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి డీటైల్డ్ గా చెప్పింది.

'ఓ సారి నాకు డిస్కోకి వెళ్లాలని అనిపించింది. అదే విషయం నాన్నకు చెబితే నో అనేశారు.కానీ నేను పట్టు పట్టేసరికి.. ఫ్యామిలీ అంతా బయల్దేరి డిస్కోకి వెళ్లాం. తీరా అక్కడున్నది మాత్రం పట్టుమని ఐదు నిమిషాలే ' అంటూ నవ్వేసింది ఐశ్వర్యా ధనుష్. ఐదు నిమిషాల డిస్కో కోసమే ఇంతలా కష్టపడాల్సి వస్తే.. ఇక సినిమాల్లో యాక్టింగ్ అంటే ఏ రేంజ్ లో సెక్యూరిటీనో ఊహించుని.. ఐశ్వర్య యాక్టింగ్ వైపు అడుగు పెట్టి ఉండకపోవచ్చు అనుకున్నారు ఆహుతులంతా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/