Begin typing your search above and press return to search.
ధనుష్ కు ఐశ్వర్య దిమ్మ తిరిగే మాట చెప్పిందా?
By: Tupaki Desk | 24 March 2017 6:16 AM GMTతమిళసూపర్ స్టార్ కుమార్తెగా సుపరిచితురాలు ఐశ్వర్య. హీరో ధనుష్ తో ఆమె పెళ్లి జరగటం తెలిసిందే. ఇండస్ట్రీలో అన్యోన్యంగా ఉండే జంటల్లో వీరిద్దరిని కోట్ చేస్తుంటారు. పెళ్లి తర్వాత ఇంటికి పరిమితం కాకుండా.. దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకునేందుకు ఐశ్వర్య చాలానే ప్రయత్నాల్ని చేసింది. ఇందులో భాగంగా ఆమె తీసిన సినిమాలు అంతంత మాత్రమే ఆడినా.. ఆమెకు రావాల్సిన పేరు ప్రఖ్యాతుల్నితెచ్చి పెట్టాయి.
తాజాగా ఆమె చేయాలనుకుంటున్న ఓ ప్రాజెక్టు కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ అయ్యింది. ఒలింపిక్ ఛాంపియన్ మారియప్పన్ జీవిత కథాంశంతో తెరకెక్కించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె చేయాలనుకునే మరో ప్రాజెక్టులో తమిళ హీరో శింబుతో చేయాలనుకుంటున్నారట. అయితే.. ఇక్కడ పాయింట్ ఏమిటంటే.. ధనుష్ కు.. శింబుకు మధ్య వృత్తిపరంగా చాలానే పోటీ ఉంది. అలాంటిది.. తనకు పోటీ అయిన శింబుతో తన భార్య సినిమా చేయాలనుకోవటాన్ని ధనుష్ జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఈ వార్తలో నిజం లేదని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం.. ఐశ్వర్య తన మనసులోని మాటను అతి కష్టమ్మీద ధనుష్ తో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ మధ్యన ధనుష్ కు సంబంధం లేని విషయంలో శింబును.. పిల్లనిచ్చిన మామ రజనీకాంత్ పొగిడితే..తెగ ఇదైపోయారట. పొగడ్తకే ఇబ్బంది పడ్డ ధనుష్..తన భార్య తనకు పోటీ అయిన హీరోతో సినిమా చేస్తానంటే ఒప్పుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. జోరుగా సాగుతున్న ప్రచారంలో నిజం ఎంతన్నది తేలాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/