Begin typing your search above and press return to search.
ప్రేమనేది ఎప్పుడూ ఒక వ్యక్తి దగ్గర ఆగిపోదు: విడాకులపై ఐశ్వర్య
By: Tupaki Desk | 18 Feb 2022 7:31 AM GMTప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో తెలియనట్టే, సెలబ్రిటీలలో ఎవరు ఎప్పుడు విడాకులు తీసుకుంటారనేది తెలియకుండా పోతోంది. సాధారణంగా వివాహమైన కొత్తలో తమ ఆలోచనలు .. అభిప్రాయాలు కలవవని తెలిసినప్పుడు, తాము తీసుకున్న నిర్ణయం సరైనదేననే ఒక రకమైన ఆవేశం కారణంగా విడాకులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే వివాహమై చాలా కాలమైన తరువాత ఏదో ఒక కారణంగా మనస్పర్థలు తలెత్తితే, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్దుకుపోవడం జరుగుతుంటుంది.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పిల్లల భవిష్యత్తు కంటే పంతాలు .. పట్టింపులకు ప్రాధాన్యత పెరిగిపోయింది. అంతవరకూ తమమధ్య ఉన్న ప్రేమానురాగాలను .. అనుభవాలను .. అనుభూతులను పక్కన పెట్టేస్తున్నారు. హఠాత్తుగా తమ విడాకుల విషయం లోకానికి చెప్పేసి, తమ నిర్ణయాన్ని గౌరవించమని ఒక లెటర్ పెట్టేస్తున్నారు. టాలీవుడ్ లో చైతూ - సమంత విడాకులు సంచలనమే అయినా, వాళ్లు దంపతులుగా ఉన్నది కేవలం ఐదేళ్లు మాత్రమే కావడం వలన ఓకే అనుకోవచ్చు.
కానీ తమిళనాట పెద్ద ఫ్యామిలీకి చెందిన ధనుశ్ - ఐశ్వర్య 18 ఏళ్లపాటు దంపతులుగా తమ జీవితాన్ని కొనసాగించిన తరువాత ఆ అనుబంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
ఎంతో బలమైన మాసిక సంఘర్షణ తరువాతనే ఎవరైనా విడాకులకు సిద్ధపడతారనేది వాస్తవం. అదేమిటనేది బయట ప్రపంచానికి తెలియదు. అందువలన అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి. రజనీ ఫ్యామిలీతో పోలిస్తే ధనుశ్ ఓ సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టే. ఈ రోజున ధనుశ్ పెద్ద స్టార్ అయినప్పటికీ, ఆయన నిలదొక్కుకోవడానికి అవసరమైన సపోర్టు రజనీ అల్లుడిగానే లభించదనడంలో ఎలాంటి సందేహం లేదు. ధనుశ్ హీరోగా చేసిన కొన్ని సినిమాలకు ఐశ్వర్య దర్శకత్వం కూడా చేసింది. అంతా బాగానే ఉందనుకుంటూ ఉండగా, ఇద్దరు పిల్లల సాక్షిగా విడాకులు తీసుకున్నారు.
అయితే ఈ ఇద్దరూ మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయనీ, నచ్చేజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఇద్దరూ విడిపోవడానికే బలంగా నిర్ణయించుకున్నారనేది సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన మాట.
తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాటలు వింటే కూడా అదే విషయం అర్థమవుతోంది. "ఎవరి లైఫ్ లోనైనా ఆటుపోట్లు ఉంటూనే ఉంటాయి. మానసికంగా వాటిని ఎదుర్కోవాలంతే. ఎదుగుతూ వస్తున్న కొద్దీ నాలో ప్రేమకి నిర్వచనం మారుతూ వచ్చింది. ఒకరి భావాలను ఒకరం వ్యక్తపరచుకోవడమే నిజమైన ప్రేమ. నేను నా పేరెంట్స్ ను ప్రేమిస్తున్నాను .. నా పిల్లలను ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది ఎప్పుడూ ఒకరి దగ్గర .. ఒకరితో ఆగిపోదు" అని చెప్పుకొచ్చింది. తాను తీసుకున్న నిర్ణయానికి ఆమె ఎంత బలంగా కట్టుబడి ఉందనే విషయం ఈ మాటలతోనే అర్థమైపోతోంది.