Begin typing your search above and press return to search.

ట్రెడిష‌న‌ల్ గాళ్ ఐశ్వ‌ర్య ల‌క్ష్మి న‌యా లుక్

By:  Tupaki Desk   |   6 Nov 2022 12:30 PM GMT
ట్రెడిష‌న‌ల్ గాళ్ ఐశ్వ‌ర్య ల‌క్ష్మి న‌యా లుక్
X
తెలుగు త‌మిళ మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌ల్లో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది ఐశ్వ‌ర్య లక్ష్మి. న‌టిగా ఇప్ప‌టికే త‌న‌దైన మార్క్ విల‌క్ష‌ణ న‌ట‌న‌తో అల‌రించిన ఈ బ్యూటీ కెరీర్ ప‌రంగా దూసుకెళుతోంది. ఇటీవ‌లే గ్రేట్ వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 (పీఎస్ 1)లో అద్భుత పాత్ర‌తో ఆక‌ట్టుకుంది. కార్తీతో ల‌క్ష్మి రొమాన్స్ ఆక‌ట్టుకుంది.

ప్ర‌స్తుతం ఈ భామ మ‌మ్ముట్టి- దుల్కార్ స‌ల్మాన్ లాంటి టాప్ స్టార్లు న‌టిస్తున్న మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు ఐశ్వర్య లక్ష్మి న‌టించిన త‌దుప‌రి చిత్రం `కుమారి` ఈ శుక్రవారం థియేటర్లలోకి విడుద‌లై ఆక‌ట్టుకుంది. అలాగే ఐశ్వర్య లక్ష్మి- నవీన్ చంద్ర- కార్తీక్ సుబ్బరాజ్ -చారుకేష్ శేఖర్ వారి తెలుగు చిత్రం `అమ్ము` ఓ ప్ర‌యోగం. ఇది గృహహింస బాధితురాలి వెత‌ల‌పై సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియో మొదటి తెలుగు ఒరిజినల్ ఫీచర్ ఫిల్మ్ అయిన `అమ్ము`తో తెలుగులో అడుగు పెట్టింది.

ఐశ్వర్య తన భర్త (నవీన్ చంద్ర) నుండి గృహహింసను ఎదుర్కొంటున్న మహిళగా నటించింది. ఒక పోలీసు నేరస్థుడు అయినప్పుడు అమ్ము ఎక్కడికి వెళుతుంది? అక్టోబర్ 19 నుంచి ఈ సిరీస్ ఓటీటీలో ప్రసారం అవుతోంది. ద‌ర్శ‌క‌నిర్మాత‌ కార్తీక్ సుబ్బరాజ్ ఈ క్రియేటివ్ స్టోరీతో నిర్మాతగా మారారు. ఈ చిత్రానికి అతని అసోసియేట్ చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించారు.

ఇక సోష‌ల్ మీడియాల్లోను ఐశ్వ‌ర్య ల‌క్ష్మి జోరుగానే ఉంది. అయితే ఇక్క‌డ ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే ఎంతో ట్రెడిష‌న‌ల్ అవ‌తార్ ల‌తో ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఐషూ ఎంచుకున్న వైట్ అండ్ వైట్ డ్రెస్ దానికి కాంబినేష‌న్ గా ప‌చ్చ‌లు పొదిగిన ముత్యాల హారంతో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. న‌ట‌న‌లో మేటి అని నిరూపిస్తున్న ఈ బ్యూటీ మునుముందు టాలీవుడ్ లో మ‌రింత‌గా మెరుస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లెట‌జ్ వెయిట్ అండ్ సీ..