Begin typing your search above and press return to search.
అతడి పక్కనైతే ఫ్రీగా చేసేస్తుందట
By: Tupaki Desk | 8 April 2017 6:16 AM GMTకొత్తగా మార్కెట్లోకి వచ్చే వస్తువు అందరి దృష్టిలో పడాలంటే.. ప్రచారం వినూత్నంగా ఉండాల్సిందే. అప్పటికే మార్కెట్లో ఉన్న వస్తువులకు పోటీగా వచ్చే కొత్త వస్తువ తానేంటో నిరూపించుకోవాలంటే విషయం ఎంతున్నా.. అంతకు మించిన ప్రచార టెక్నిక్ తప్పనిసరి. ఇది వస్తువు విషయంలోనే కాదు.. వ్యక్తుల విషయంలోనూ ఇదే ఫార్ములా అప్లై అవుతుందని చెప్పక తప్పదు.
విపరీతమైన పోటీ ఉండే గ్లామర్ ఫీల్డ్ లో కొత్తగా వచ్చే అమ్మాయి.. అందరి దృష్టిని ఆకర్షించాలన్నా.. అందరికి సుపరిచితం కావాలన్నా.. పేరు ప్రఖ్యాతులుసొంతం చేసుకోవాలనుకున్నా ప్రచారం తప్పనిసరి. ఇందుకోసం చాలానే ప్రయత్నాలు చేస్తుంటారని చెబుతుంటారు. వాటిని పక్కన పెడితే.. మిగిలిన వారికంటే భిన్నమైన స్టేట్ మెంట్ తో ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది నటి ఐశ్వర్య మీనన్.
మలయాళం.. కన్నడ భాషల్లో నటిగా పరిచయమైన ఈ మలబార్ ముద్దుగుమ్మ తాజాగా వీర చిత్రంలో నటుడు కృష్ణకు జంటగా నటిస్తోంది. ఎంత ప్రయత్నం చేసినా అరకొర వేషాలే తప్పించి.. అగ్రహీరో పక్కన ఛాన్స్ మాత్రం కొట్టలేకపోతోంది. మరీ.. విషయం మీద బాగా థింక్ చేసిందో ఏమో కానీ.. ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి తన గురించి మాట్లాడేసేలా ఒక కొత్తతరహా మాటను చెప్పింది.
అగ్రహీరోల్లో ఒకరైన ఆర్య అంటే తనకు చాలా ఇష్టమని.. ఎంత ఇష్టమంటే.. తాను కాలేజీకి వెళ్లే టైంలో అతడ్ని విపరీతంగా అభిమానించేదానినని.. ఆర్య సరసన నటించే అవకాశం రావాలే కానీ.. తనకు పైసా కూడా రెమ్యునరేషన్ వద్దంటే వద్దని చెబుతోంది. కేవలం నోటి మాటతోనే పరిమితం కాకుండా.. ఆర్య ఎవరెవరితో చిత్రాలు చేస్తున్నాడో తెలుసుకొని.. తనకున్న మార్గాల ద్వారా.. తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ రాయబారాలు పంపుతున్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఆర్యతో కలిసి నటించాలన్న దృడ చిత్తంతో ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ వర్క్ వుట్ అవుతాయో చూడాలి. ఆర్యతో అవకాశం వచ్చినా.. రాకున్నా ఆయన పేరు పుణ్యమా అని మాత్రం ఐశ్వర్య ఇప్పుడు అందరి నోళ్లల్లో మాత్రం నానుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/