Begin typing your search above and press return to search.

మొగుడితో కలసి 'గులాబ్‌ జామున్‌'

By:  Tupaki Desk   |   28 Feb 2017 6:16 AM GMT
మొగుడితో కలసి గులాబ్‌ జామున్‌
X
కొన్ని జంటలను స్ర్కీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది. ఆ విషయం సదరు జంటలకు కూడా అనిపించి.. వారి మధ్యలో ప్రేమ పరిమిళిస్తే.. వెంటనే పెళ్లి పీటలు కూడా ఎక్కేసిన వారున్నారు. 'శివ' సినిమాతో నాగార్జున అండ్ అమల అదే టైపులో ప్రేమలో పడిపోతే.. 'ధూమ్ 2' సినిమా చేస్తున్న సమయంలో అందాల రాశి ఐశ్వర్య రాయ్ కూడా అభిషేక్ బచ్చన్ ప్రేమలో పడిపోయింది. ఆ తరువాత 2007లో వారు పెళ్ళి చేసుకున్నారు.

అయితే చివరగా 2007లో ''గురు'' అలాగే 2010లో ''రావణ్‌'' సినిమాలో కలసి నటించిన ఐష్‌ అండ్ అభి జంట.. ఆ తరువాత ఒక్కసారి కూడా కలిపి కనిపించలేదు. ఆరాధ్య పుట్టడంతో ఐశ్వర్య సినిమాలకు దూరమైతే.. అభిషేక్ కూడా ఇతర వ్యాపారాల్లో బిజీ అయిపోయి సినిమాలను కాస్త పక్కనెట్టేశాడు. అయితే ఇప్పుడు ఐష్‌ తిరిగి సినిమాల్లోకి వచ్చాక కూడా పెద్దగా హిట్లు కొట్టకపోవడంతో.. అసలు ఈ ఇద్దరూ కలసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే యాంగిల్లో కథలు వండేస్తున్నారు దర్శకులు.

అలాంటి ఓ కథే ఇప్పుడు ''గులాబ్ జామున్'' పేరుతో రానుందా అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ వాసులు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా ఆ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారట. ఇదొక రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది. సినిమా టైటిల్ లో ఉన్నంత స్వీట్నెస్ కంటెంట్లో కూడా ఉంటుందట. గెట్ రెడీ ఫ్యాన్స్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/